న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై విజయం తర్వాత పంత్‌కు కీపింగ్ పాఠాలు చెప్పిన ధోని (వీడియో)

MS Dhoni gives tips to Rishabh Pant after Chennai Super Kings’ win

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా రిషబ్ పంత్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలో భాగంగా విశాఖపట్నం వేదికగా జరిగిన క్వాలిఫయిర్-2 మ్యాచ్ అనంతరం ధోని నుంచి పంత్ వికెట్ కీపింగ్ మెళకువలు నేర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

పంత్ మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ "ధోని, కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా. వారిలో క్రమశిక్షణ చాలా కీలకమైనది. మహీ భాయ్ ఏ రోజు ఆలస్యంగా రాలేదు. అతను అనుసరించే పద్దతే ఈ రోజు ఇంతస్థాయికి తీసుకొచ్చింది. ఏం సరిపోతుందో ఏది సరిపడదో అతనికి బాగా తెలుసు" అని ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో

క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో

శుక్రవారం విశాఖపట్నం వేదికగా జరిగిన క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమికి గురైంది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా... చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆదివారం హైదరాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

సెంటిమెంట్ ఫలించేనా?

సెంటిమెంట్ ఫలించేనా?

2013, 2015, 2017... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ విజేతగా నిలిచిన సంవత్సరాలు. దీనిని బట్టి చూస్తే రెండేళ్ల గ్యాప్‌తో ఈ జట్టు కప్‌ కొడుతూ వస్తోంది. ఇప్పుడు 2019 వచ్చింది. ఈ సెంటిమెంట్‌ ఫలిస్తే ఉప్పల్‌లో విజేతగా నిలిచేది ముంబై ఇండియన్స్ లేక డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ను కాపాడుకుంటుందా?

 తొలి నలుగురు చెన్నై ఆటగాళ్లే

తొలి నలుగురు చెన్నై ఆటగాళ్లే

ఇండియన్ ప్రీమయిర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి నలుగురు ఆటగాళ్లు చెన్నైకి చెందిన వారే కావడం విశేషం. సురేశ్ రైనా (241 పరుగులు), మురళీ విజయ్ (181 పరుగులు), ధోనీ (178 పరుగులు), షేన్ వాట్సన్ (156 పరుగులు) అత్యధిక పరుగులు చేసిన వారిలో ముందున్నారు

ఇది రెండోసారి

ఇది రెండోసారి

హైదరాబాద్‌లో ఫైనల్‌ జరగడం ఇది రెండోసారి. వాస్తవానికి ఈ మ్యాచ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సొంత మైదానమైన చెపాక్‌ స్టేడియంలో జరగాల్సి ఉన్నా స్టాండ్స్‌ వివాదం కారణంగా భాగ్య నగరానికి ఆతిథ్య భాగ్యం దక్కింది. 2017లో పుణెతో జరిగిన తుదిపోరులో ముంబై గెలిచింది. ముంబై, చెన్నై జట్ల మధ్య ఇది నాలుగో ఫైనల్‌. గత ఫైనల్స్‌లో చెన్నై ఓసారి (2010) .. ముంబై రెండుసార్లు (2013, 2015) నెగ్గాయి.

Story first published: Sunday, May 12, 2019, 16:31 [IST]
Other articles published on May 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X