న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని కెరీర్‌లో ఉద్విగ్నభరిత క్షణాలు ఏవో తెలుసా?

By Nageshwara Rao
 MS Dhoni feels that atmosphere at the finals of the world cup 2011 will never be created again

హైదరాబాద్: టీమిండియాకు రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఒకే ఒక్క కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఉత్కంఠ భరిత పరిస్థితుల్లో కూడా కూల్‌గా ఉండటమే ధోనికి ఇష్టం. ఏ మాత్రం సమన్వయం కోల్పోకుండా క్లిష్ట సమయాల్లో చురుగ్గా పనిచేసే ధోని అంటే ఎంతో మంది అభిమానులకు ఇష్టం.

అలాంటి ధోనిని క్రికెట్లో తాను ఎదుర్కొన్న ఉద్విగ్నభరిత క్షణాలు ఏవని ప్రశ్నిస్తే? డ్రెస్సింగ్ రూంలో అడుగు పెట్టిన కొత్తలో ఎలా ఫీలయ్యారని ప్రశ్నిస్తే? ధోని చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?

'2011లో టీమిండియా సొంత ప్రేక్షకుల మధ్య వరల్డ్ కప్‌ నెగ్గింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గెలుపొందిన టీమిండియా సుదీర్ఘ కాలం తర్వాత ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. మరో నాలుగైదు ఫైనల్ మ్యాచ్ ఓవర్లలో ముగుస్తుందనగా.. స్టేడియంలో కూర్చొని మ్యాచ్ తిలకిస్తున్న ప్రేక్షకులు వందేమాతరం అని నినదించారు. హుషారైన పాటలతో హోరెత్తించారు. దీంతో మనం వరల్డ్ కప్‌ను గెలవబోతున్నాం అని ముందే తెలిసిపోయింది. ఆ క్షణాలు ఎప్పటికీ తిరిగి రావు. అలాంటి వాతావరణాన్ని తిరిగి సృష్టించలేం. కానీ మళ్లీ ఏదో ఒక రోజు అలాంటి సన్నివేశాన్ని కళ్లారా చూస్తానని ఆశిస్తున్నా' అని ధోనీ తెలిపాడు.

భారత జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత దిగ్గజ క్రికెటర్లను కలిసే అవకాశం ధోనికి లభించింది. టీమిండియాకు ఎంపికైన తర్వాత తన తొలి పర్యటన అనుభవాన్ని ధోని పంచుకున్నాడు. తొలిసారి డ్రెస్సింగ్ రూంలో అడుగుపెట్టాక సీనియర్లతో ఎలా మెలగాలో తెలియలేదని ధోని చెప్పడం విశేషం.

'(నవ్వుతూ) సీనియర్లతో ఎలా మెలగాలో తెలియలేదు. అది బంగ్లాదేశ్ పర్యటన... కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాం. నాలుగు రోజుల పర్యటన కావడంతో ఈ పర్యటనలో ఎన్నో ఎమోషన్స్‌ని సొంతం చేసుకున్నాం. ఈ పర్యటనలో రెండో మ్యాచ్ ఓడిపోయాం. డ్రస్సెంగ్ రూమ్‌కు వెళ్లడానికి ముందు మీటింగ్ రూమ్‌కి వెళ్లా. అక్కడ అందరూ సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. భారత క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్లను అప్పుడే చూశా. కొంచెం సిగ్గుతో ఏం మాట్లాడలేకపోయా' అని ధోని చెప్పుకొచ్చాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 15, 2017, 17:43 [IST]
Other articles published on Nov 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X