కుల్దీప్‌ని చూస్తూ.. ధోనీ సంగతి మర్చిపోయి.. (వీడియో)

Posted By: Subhan
ms-dhoni-fast-stumping-india-vs-south-africa-5th odi

హైదరాబాద్: భారత్, దక్షిణాఫ్రికా ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఆరో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌కు సిరీస్ చేజిక్కినట్టైంది. ఈ మ్యాచ్‌లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్‌ని భయపెట్టబోయి.. దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ క్లాసెన్ బోల్తాపడ్డాడు.

గత శనివారం ముగిసిన నాలుగో వన్డేలో క్లాసెన్ తనదైన హిట్టింగ్‌తో సఫారీ జట్టుని గెలిపించాడు. ఐదో వన్డేలోనూ అదే తరహా ఆటతీరుతో టీమిండియాని కాసేపు కంగారు పెట్టాడు. ముఖ్యంగా.. స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ని లక్ష్యంగా చేసుకుని రెండు భారీ సిక్సర్లు బాదేశాడు. వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ సూచనలు తీసుకున్న కుల్‌దీప్‌.. ఇన్నింగ్స్ 42వ ఓవర్‌లో తెలివైన బంతిని విసిరి క్లాసెన్‌ని ఔట్ చేశాడు.

ఆ ఓవర్‌లోని ఐదో బంతి‌ని ఆఫ్ట్ స్టంప్‌కి వెలుపలగా ప్లైటెడ్ డెలివరీ రూపంలో కుల్దీప్ విసరగా.. క్రీజు వెలుపలికి వచ్చి మరో సిక్స్ కొట్టేందుకు క్లాసెన్ ప్రయత్నించాడు. కానీ.. బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని క్లాసెన్ బ్యాట్‌కి అందకుండా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో బంతిని అందుకున్న ధోనీ.. క్షణాల వ్యవధిలోనే వికెట్లని గీరాటేశాడు. స్టంపౌట్ ప్రమాదాన్ని పసిగట్టి క్లాసెన్ వెనక్కి చూడగా.. అప్పటికే బెయిల్స్ ఎగరగొట్టిన ధోనీ.. వికెట్లపై నుంచి దూకుతూ అతనికి కనిపించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ 115 పరుగులు చేసి సెంచరీని పూర్తి చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌట్ అయి కుప్పకూలిపోయింది. దీంతో ఆరు వన్డేల సిరీస్‌ని భారత్ 4-1తో చేజిక్కించుకుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 14, 2018, 15:31 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి