న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బర్త్‌డే స్పెషల్‌: ధోని నెలకొల్పిన ఆసక్తికరమైన రికార్డులివే

By Nageshwara Rao
MS Dhoni Birthday: Interesting records held by MS Dhoni in international cricket

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ శనివారం 37వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనికి అభిమానులతో పాటు ప్రస్తుత మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ధోని పుట్టిన రోజును టీమిండియా క్రికెటర్లు ఘనంగా జరిపారు.

ఈ సందర్భంగా పాండ్యా బ్రదర్స్‌ 'హ్యాపీ బర్త్‌డే మహీ' అంటూ పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. బీసీసీఐ అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడిగా నిలిచాడు. తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు.

భారత క్రికెట్ జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలు పంచుకున్న ధోని.. భారత జట్టు తరపును 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వరల్డ్ కప్, వరల్డ్ టీ20, చాంపియన్స్ ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు. బర్త్‌డే సందర్భంగా ధోని నెలకొల్పిన రికార్డుల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.


అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్టంపింగ్‌లు(178) చేసిన వికెట్‌ కీపర్‌గా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు.


టీమిండియా తరపున ఆరు వరల్డ్ టీ20 టోర్నీలకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్‌గా ధోనియే.


టీమిండియా తరుపున 110 వన్డే విజయాలకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్ తరపున ఇదే అత్యధికం కాగా, ఒక జాతీయ జట్టుకు అత్యధిక వన్డే విజయాలను అందించిన రెండో కెప్టెన్‌గా ధోని నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన పాంటింగ్(165) ఉన్నాడు.


అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్(82) చేసిన వికెట్ కీపర్‌గా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ధోని ఈ రికార్డుని నెలకొల్పాడు.


అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌ ధోని. అతని కంటే ముందు సచిన్‌ టెండూల్కర్‌(664), రాహుల్‌ ద‍్రవిడ్‌(509)లు ఉన్నారు. మొత్తంగా ఈ ఘనత సాధించిన 9వ క్రికెటర్ ధోని.


500 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 780 ఔట్లలో ధోని భాగస్వామిగా ఉన్నాడు. ఈ రికార్డు సాధించిన మూడో వికెట్‌ కీపర్‌. గతంలో మార్క్‌ బౌచర్‌(998), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌(905)లు ఉన్నారు.


ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ధోని ఉన్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రెండు సెంచరీలు నమోదు చేశాడు.


ఎనిమిది టెస్టు హోదా కలిగిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను ధోని నెగ్గాడు. ఇక్కడ తొమ్మిది టెస్టు హోదా కలిగిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలిచిన వారిలో కెప్టెన్‌గా రికీ పాంటింగ్ ముందున్నాడు. టెస్టు హోదా కలిగిన తొమ్మిది దేశాలపై పాంటింగ్ వన్డే సిరీస్‌లను గెలిచాడు. బంగ్లాదేశ్‌పై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సాధించడంలో ధోని విఫలం కావడంతో పాంటింగ్ సరసన నిలవలేకపోయాడు.


2007లో ఆఫ్రో-ఆసియా కప్‌లో భాగంగా జయవర్ధనేతో కలిసి ఆరో వికెట్‌కు ధోని 218 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది వన్డేల్లో ఆరో వికెట్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యం.


ఐసీసీ ప్రతి ఏటా ప్రకటించే వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును రెండుసార్లు గెలిచిన ఏకైక క్రికెటర్‌ ధోని.


మూడు ఐసీసీ మేజర్ టోర్నమెంట్లను గెలిచిన ఏకైక కెప్టెన్ (వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ).


ప్రతి ఫార్మాట్లోనూ కనీసం 50 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు.


భారత్ సాధించిన విజయాల్లో వన్డే కెప్టెన్‌గా ధోని యావరేజ్ 70.83గా ఉంది. కనీసం వెయ్యి పరుగుల సాధించిన ఓవరాల్ కెప్టెన్లలో ఇది మూడో అత్యుత్తమ యావరేజ్.


వన్డేల్లో కెప్టెన్‌గా 110 విజయాలు సాధించిన ధోని.. 74 పరాజయాలను ఎదుర్కొన్నాడు. కనీసం 20 వన్డేలకు సారథ్యం వహించిన భారత ఆటగాళ్ల పరంగా చూస్తే గెలుపు-ఓటముల రికార్డులో ధోనినే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.


కెప్టెన్ గా ధోని కొట్టిన సిక్సులు 126. ఓవరాల్ కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత ధోనిది.


ఐదు అంతకంటే ఎక్కువ జట్లు ఆడిన నాలుగు టోర్నీలను గెలిచిన ఘనత ధోనిది. ఈ ఘనతను సాధించిన కెప్టెన్ల పరంగా చూస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి ధోని సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.


43 వన్డే సిరీస్‌లకుకు ధోని కెప్టెన్‌గా వ్యహరించాడు. ఇది భారత్ తరపున అత్యధికం కాగా, ఓవరాల్‌గా నాలుగోది


199 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక భారత్ ఆటగాడు ధోని. ఓవరాల్‌గా మూడో స్థానంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్లను కలుపుకుని 331 మ్యాచ్‌లకు ధోని సారథిగా వ్యవహరించాడు.

Story first published: Saturday, July 7, 2018, 13:33 [IST]
Other articles published on Jul 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X