న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా ఐపీఎల్ 100 విజయాలు: ధోని ఖాతాలో మరో రికార్డు

IPL 2019 : MS Dhoni First Ever Captain To Win 100 Matches In IPL History || Oneindia Telugu
MS Dhoni Becomes First Captain to Win 100 IPL Matches, Achieves Feat During RR vs CSK in Jaipur

హైదరాబాద్: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోనికి ఇది వందో విజయం కావడం విశేషం.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కెప్టెన్‌గా ధోని 100 విజయాలు

కెప్టెన్‌గా ధోని 100 విజయాలు

కెప్టెన్‌గా ధోనీ 100 విజయాల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మొత్తం 166 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 65 మ్యాచ్‌ల్లో ఓడిపోగా... ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. అనంతరం 152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఇన్నింగ్స్‌ పేలవంగా ప్రారంభమైంది.

తొలి ఓవర్‌ నాలుగో బంతికే వాట్సన్‌ డకౌట్‌గా

తొలి ఓవర్‌ నాలుగో బంతికే వాట్సన్‌ డకౌట్‌గా

ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నాలుగో బంతికే వాట్సన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆర్చర్‌ వేసిన సూపర్‌ త్రోకు సురేశ్ రైనా (4) రనౌటయ్యాడు. దీంతో మూడు ఓవర్లకు గాను చెన్నై 10 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్థితిలో భారీ షాట్‌కు పోయిన డుప్లెసిస్‌ (7) ఉనాద్కత్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కేదార్ జాదవ్(1) వెనుదిరిగాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

అంబటి రాయుడితో కలిసి ఇన్నింగ్స్

అంబటి రాయుడితో కలిసి ఇన్నింగ్స్

ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి అంబాటి రాయుడు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించారు. రాజస్థాన్ బౌలర్ పరాగ్‌ బౌలింగ్‌లో ధోని చెలరేగాడు. ఈ క్రమంలో హాఫ్‌సెంచరీ అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నించిన రాయుడు(57) గోపాల్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో చెన్నై విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో 30 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఆ జట్టు ఒక్కసారిగా ఒత్తిడిలోకి పోయింది.

ఫ్రీహిట్‌ బంతికి రెండు పరుగులు చేసిన ధోని

ఫ్రీహిట్‌ బంతికి రెండు పరుగులు చేసిన ధోని

అయితే, క్రీజులో ధోని ఉండడంతో అభిమానులు చెన్నై గెలుస్తుందనే ధీమాతోనే ఉన్నారు. ఇక, ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం అయ్యాయి. ఈ స్థితిలో తొలి బంతికి జడేజా కళ్లుచెదిరే సిక్స్‌ బాదాడు. ఆ తర్వాత బంతిని బెన్ స్టోక్స్ నోబాల్‌‌గా సంధించాడు. ఈ బంతికి జడేజా ఒక పరుగు తీశాడు. ఫ్రీహిట్‌ బంతికి రెండు పరుగులు చేసిన ధోని.. మూడో బంతికి బౌల్డ్‌ అవడంతో మ్యాచ్‌ మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది. ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టాల్సి రాగా మిచెల్ శాంట్నర్‌ (10) సిక్స్‌ బాది చెన్నైకు విజయాన్ని అందించాడు.

Story first published: Friday, April 12, 2019, 15:17 [IST]
Other articles published on Apr 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X