న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ సతీమణి సాక్షి సింగ్ బర్త్ డే వేడుకల్లో పాక్ క్రికెటర్!

MS Dhoni and Shoaib Malik reunite with their families on Sakshi Dhoni’s birthday

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్‌తో సుమారు రెండు నెలలపాటు తీరిక లేకుండా గడిపిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం సేద తీరుతున్నాడు. తన సతీమణి సాక్షి సింగ్ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్ వెళ్లిన మహీ... అక్కడే కొందరు స్నేహితులతో కలిసి ఆమె బర్త్ డేను సెలబ్రేట్ చేశాడు.

ధోనీ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియా వేదికగా బయటకొచ్చాయి. ఇక సాక్షి బర్త్ డే పార్టీలో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దంపతులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. సానియా మీర్జా షేర్ చేసిన ఫొటోల ప్రకారం.. ఆమెతోపాటు సానియా సోదరి కూడా ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

బర్త్ డే గర్ల్ సాక్షి, ధోనీతో కలిసి దిగిన ఫొటోను సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫొటోలను బట్టి.. సాక్షి బర్త్ డేను ధోనీ, మాలిక్ కుటుంబాలు సెలబ్రేట్ చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. భారత్, పాక్ క్రికెటర్లయిన ధోనీ, మాలిక్‌లు మంచి స్నేహితులు.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతుండగా.. షోయబ్ మాలిక్ పాక్ తరఫున టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కానీ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్థాన్ సెలక్టర్లు మాలిక్‌ను ఎంపిక చేయలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం మాలిక్‌, అమీర్‌ను పక్కనబెట్టినట్లు తెలిపారు.

వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత మాలిక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైరయ్యే అవకాశం ఉంది. ఇక ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్‌తో క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో మహీ సారథ్యంలోని చెన్నై దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.

తండ్రైన ఏబీ డివిలియర్స్.. అభినందనలతో ముంచెత్తిన ఫ్యాన్స్తండ్రైన ఏబీ డివిలియర్స్.. అభినందనలతో ముంచెత్తిన ఫ్యాన్స్

Story first published: Friday, November 20, 2020, 11:32 [IST]
Other articles published on Nov 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X