5వ వన్డే: గిల్‌క్రిస్ట్‌ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

Posted By:
Most Sixes: Rohit sharma breaks adam gilchrist record in 5th ODI

హైదరాబాద్: పోర్ట్‌ ఎలిజబెత్‌‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరిస్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో విఫలమైన రోహిత్ ఐదో వన్డేలో నిలకడగా ఆడుతూ సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు.

భారత్-దక్షిణాఫ్రికా 5వ వన్డే లైవ్ స్కోరు కార్డు

ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో సఫారీ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

మొత్తం 94 ఇన్నింగ్స్‌లలో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ 145 సిక్సర్లతో ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ ఆడమ్ గిల్ క్రిస్ట్ (114) సిక్సుల రికార్డుని అధిగమించాడు. కాగా, ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 383 ఇన్నింగ్స్‌లు ఆడిన జయసూర్య 263 సిక్సర్లు బాదాడు.

ఇక, 250 ఇన్నింగ్స్‌లలో 250 సిక్సర్లతో వెస్టిండిస్‌కు చెందిన విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. 340 ఇన్నింగ్స్‌లలో 167 సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్ మూడో స్థానంలో ఉన్నాడు. తాజాగా రోహిత్ శర్మ 145 సిక్సర్లతో ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, February 13, 2018, 19:25 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి