న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పేసర్ షమీకి షాక్: సమన్లు జారీ చేసిన కోల్‌కతా పోలీసులు

By Nageshwara Rao
Mohammed Shami Summoned Kolkata Police Over Cheque Bounce
Mohammed Shami summoned by Kolkata Police over cheque bounce case

హైదరాబాద్: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్య హసీన్‌ జహాన్‌ చేసిన ఫిర్యాదుతో షమీకి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. సెప్టెంబర్‌ 20వ తేదీన కోర్టుకు హాజరు కావాలని అలీపూర్‌ కోర్టు క్రికెటర్‌ను ఆదేశించింది.

గత మార్చి నెలలో షమీ తన భార్య హసీన్‌ జహాన్‌‌కు రూ. లక్ష చెక్కు ఇచ్చాడు. తనకు షమీ ఇచ్చిన లక్ష రూపాయల చెక్‌ (నెంబర్‌ 03718) బౌన్స్‌ అయిందని హసీన్‌ జహాన్‌ ఫిర్యాదు చేసింది. ఈ చెక్ బౌన్స్ కేసును విచారించిన అలీపూర్‌ కోర్ట్‌ సెప్టెంబర్‌ 20న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా, అంతకముందు నెలకు తనకు రూ.10 లక్షల భరణం ఇవ్వాలని షమీని భార్య డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ పోషణకు రూ. 7లక్షలు, తమ పాప కోసం రూ. 3 లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరగనున్న మొదటి మూడు టెస్టులకు సెలక్టర్లు ప్రకటించిన టెస్టు జట్టులో షమీ చోటు దక్కించుకున్నాడు.

ఇటీవల నిర్వహించిన యో-యో టెస్టులో విఫలమవడంతో ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌లతో జరిగిన పరిమిత ఓవర్ల టోర్నీలకు షమీ దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ యో-యో టెస్టులో పాసవ్వడంతో ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఆరంభం కానున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు షమీ ఎంపికయ్యాడు.

Story first published: Wednesday, July 18, 2018, 19:05 [IST]
Other articles published on Jul 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X