న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్ ప్రమాదకర ఆటగాడు.. ఆ రోజు అతన్ని ఆపడం ఎవరితరం కాదు: షమీ

Mohammed Shami says The day Rishabh Pant gets confident, he will be very dangerous

కోల్‌క‌తా: టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ రిష‌బ్ పంత్‌లో అపార‌మైన ప్ర‌తిభ ఉంద‌ని స్టార్ పేసర్ మ‌హ్మ‌ద్ ష‌మీ అన్నాడు. వ‌య‌సుకు మించిన టాలెంట్ అత‌డి సొంత‌మ‌ని పేర్కొన్నాడు. లోకేశ్ రాహుల్ ప్ర‌స్తుతం అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్నాడ‌న్నాడు. ఆల్‌రౌండ‌ర్ అంటే హార్దిక్ పాండ్యానే అని పేర్కొన్నాడు. భార‌త మాజీ ఆట‌గాడు ఇర్ఫాన్ ప‌ఠాన్‌తో బుధవారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న ష‌మీ.. త‌న అభిప్రాయాలు వ్య‌క్తం చేశాడు.

<strong>'క్రికెట్‌కు ఆరు నెలలు దూరంగా ఉన్నా.. ధోనీ బ్యాటింగ్‌లో ఎలాంటి తడబాటు లేదు</strong>'క్రికెట్‌కు ఆరు నెలలు దూరంగా ఉన్నా.. ధోనీ బ్యాటింగ్‌లో ఎలాంటి తడబాటు లేదు

పంత్‌లో చాలా టాలెంట్ ఉంది:

పంత్‌లో చాలా టాలెంట్ ఉంది:

'యువ వికెట్ కీప‌ర్, బ్యాట్స్‌మ‌న్ రిషబ్ పంత్‌లో చాలా టాలెంట్ ఉంది. అత‌డు నా స్నేహితుడ‌ని నేను ఈ మాట‌లు చెప్ప‌డం లేదు. అయితే అతడిలో కాస్త ఆత్మవిశ్వాసం లోపించింది. ఏ రోజైతే అతడు పూర్తి విశ్వాసంతో ఆడతాడో ఆరోజు ప్రత్యర్థి జట్టు ప్రమాదంలో పడినట్టే. పొట్టి ఫార్మాట్‌లో పంత్ బాగా ఆడతాడు. తన షాట్ ఎంపికలో కొంత తడబాటుకు గురవుతున్నాడు. కొన్నిసార్లు పేలవమైన షాట్లు ఆడి పెవిలియన్ చేరాడు' అని మ‌హ్మ‌ద్ ష‌మీ చెప్పాడు.

రాహుల్ కెరీర్ అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్నాడు:

రాహుల్ కెరీర్ అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్నాడు:

'లోకేశ్ రాహుల్ కెరీర్ అత్యుత్త‌మ ఫామ్‌లో కొన‌సాగుతున్నాడు. అందుకే ఏ స్థానంలో అయినా దుమ్మురేప‌గ‌లుగుతున్నాడు. అత‌డెప్ప‌టికీ ఇలాగా ఆడాలని ఆశిస్తున్నా' అని ష‌మీ అన్నాడు. మరోవైపు ఇర్ఫాన్ ప‌ఠాన్‌ కూడా రాహుల్ ఫామ్ అద్భుతం అని కొనియాడాడు. ఆల్‌రౌండ‌ర్ అంటే నా దృష్టిలో హార్దిక్ పాండ్యానే అని ష‌మీ చెప్పుకొచ్చాడు. ఎవరైనా ఆల్‌రౌండ‌ర్ కావాలనుకుంటే.. హార్దిక్ లాగా ఉండండని సూచించాడు. టీ20 క్రికెట్ వినోదాన్ని పంచుతుంది కానీ.. నేను టెస్ట్ క్రికెట్ ఆడాలనుకుంటున్నా అని షమీ చెప్పుకొచ్చాడు.

మహీ భాయ్ అదే చెప్పాడు:

మహీ భాయ్ అదే చెప్పాడు:

2019 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై హ్యాట్రిక్ సాధించిన తన జ్ఞాపకాలను కూడా ఈ పేసర్ గుర్తుచేసుకున్నాడు. 'మూడు స్టంప్‌ల గురించి మాత్రమే ఆలోచించా. 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయాలనుకున్నా. వరుసగా రెండు వికెట్లు తీసిన తరువాత యార్కర్‌ బాల్ చేయాలనేది నా ప్రణాళిక. మహీ భాయ్ (ఎంఎస్ ధోనీ) కూడా అదే సూచించాడు. నేను అదే చేసాను. హ్యాట్రిక్ సాధించా' అని షమీ తెలిపాడు. చివరి ఓవర్ బౌలింగ్ చేసి హ్యాట్రిక్ తీసి నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడా:

పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడా:

'2015 వన్డే ప్రపంచకప్ సమయంలో నా మోకాలికి గాయమైంది. మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత గాయం కారణంగా నా మోకాలు వాపు వచ్చింది. దీంతో మోకాలు, తొడ ఒకే పరిమాణంలో కనిపించాయి. కానీ టోర్నీలో జట్టుకి నా అవసరం ఉండటంతో.. వరుస మ్యాచ్‌ల్లో ఆడించారు. ప్రతి మ్యాచ్‌కి ముందు మూడు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చింది. నితిన్ పటేల్ కారణంగానే టోర్నీ ఆడా' అని షమీ తెలిపాడు.

Story first published: Thursday, April 16, 2020, 14:18 [IST]
Other articles published on Apr 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X