న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఐపీఎల్‌ 2020 నిర్వహించడానికి సమయం ఉండకపోవచ్చు.. ఇక ఆశలు వదులుకోవాల్సిందే'

Mohammed Shami says Dont think there will be time left to hold IPL this year

కోల్‌కతా: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 నిర్వహించడానికి సమయం ఉండకపోవచ్చు అని టీమిండియా స్టార్ పేసర్‌ మహ్మద్‌ షమీ అన్నాడు. ఐపీఎల్‌పై ఇక ఆశలు వదులుకోవచ్చని అన్నాడు. ఈ ఏడాది చివరలో ఐపీఎల్‌ జరిగే కంటే.. టీ20 ప్రపంచకప్‌‌కు ముందు జరిగితేనే బాగుంటుందన్నాడు. ఇండియా టుడే స్పోర్ట్స్ ఎడిటర్ విక్రాంత్ గుప్తాతో షమీ మాట్లాడుతూ ఐపీఎల్‌ గురించి పలు విషయాలను తెలిపాడు.

మూడు ఫార్మాట్లలో కెప్టెన్ కావాలనుకుంటున్నా.. అదే నా కల: స్టార్ స్పిన్నర్మూడు ఫార్మాట్లలో కెప్టెన్ కావాలనుకుంటున్నా.. అదే నా కల: స్టార్ స్పిన్నర్

సమయం ఉండకపోవచ్చు:

సమయం ఉండకపోవచ్చు:

'నేను ఐపీఎల్‌ సాధ్యాసాధ్యలపై ఇర్ఫాన్‌ పఠాన్ భాయ్‌తో మాట్లాడుతూనే ఉన్నా. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ 2020 నిర్వహించడానికి సమయం ఉండకపోవచ్చు. ఇక్కడ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతీది ఆగిపోయింది. ప్రతీ టోర్నీని రీషెడ్యూల్‌ చేయడమే కనిపిస్తుంది. దాంతో ఈ ఏడాది ఐపీఎల్‌ జరగదనేది నా అభిప్రాయం. ఏం జరుగనుందో చూడటం మాత్రమే మనం చేయాల్సింది. ఒకవేళ లాక్‌డౌన్‌ తొందరగా ముగిసిపోతే అప్పుడు ఐపీఎల్‌ గురించి ఏమైనా ఆలోచించవచ్చు' అని షమీ అన్నాడు.

ఐపీఎల్‌ జరిగే కంటే:

ఐపీఎల్‌ జరిగే కంటే:

'లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకూ నిరీక్షణ తప్పదు. ఈ ఏడాది చివరలో ఐపీఎల్‌ జరిగే కంటే.. టీ20 ప్రపంచకప్‌కు ముందు జరిగితేనే బాగుంటుంది. ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్‌కు ఐపీఎల్‌ ఒక సన్నాహకంగా ఉపయోగపడుతుంది. పరిస్థితులు చక్కబడి క్రికెట్‌ ఆరంభమైన తర్వాత క్రికెటర్లు తమ పూర్వపు ఫామ్‌ అందుకోవడానికి కనీసం నెల సమయం పడుతుంది. క్రీడా స్టార్స్‌లో దాదాపు 95 శాతం మంది ఎటువంటి యాక్టివిటీస్‌ లేకుండా ఇంటిలోనే ఉండిపోయారు. దాంతో ఆయా ఆటగాళ్లు గాడిలో పడటానికి సమయం పడుతుంది' అని షమీ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ నిరవధిక వాయిదా:

ఐపీఎల్ నిరవధిక వాయిదా:

అన్ని బాగుంటే ఈ పాటికి ఐపీఎల్ లీగ్ చివరి అంకానికి చేరుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభంకావాల్సి ఉండగా.. దేశంలో కరోనా వైరస్ కారణంగా తొలుత ఏప్రిల్ 15కి టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. ఏప్రిల్ 15 నాటికి కరోనా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. కేంద్రం లాక్‌డౌన్‌ను మరోసారి పొడగించడంతో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. టోర్నీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేం.

తీవ్ర ఒత్తిడికి గురయ్యా:

తీవ్ర ఒత్తిడికి గురయ్యా:

'రోజు రోజుకు పెరుగుతున్న సమస్యలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. అప్పుడే కుటుంబ సమస్యలు, దానికి తోడు రోడ్డు ప్రమాదం. అది కూడా ఐపీఎల్‌కు 10-12 రోజుల ముందు. అలాగే నా వ్యక్తిగత విషయాలు మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆ సమయంలో నా కుటుంబమే అండగా లేకుంటే ఈ రోజు నేనిలా ఉండేవాడిని కాదు. మళ్లీ క్రికెట్ ఆడేవాడిని కాదు. వరుసగా ఎదురైన సమస్యలతో మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. కానీ నా కుటుంబం మద్దతుగా నిలవడంతో సమస్యల నుంచి గట్టెక్కా. వ్యక్తిగత సమస్యలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యా. ఆ సమయంలో క్రికెట్‌పై ఆలోచన కూడా రాలేదు. మేమంతా అప్పుడు 24వ అంతస్థులో ఉండేవాళ్లం. నేను బాల్కనీ నుంచి దూకేస్తానేమోనని నా కుటుంబం ప్రతీ క్షణం భయపడేది. నా సోదరుడు చాలా మద్దతుగా నిలిచాడు. నా ఫ్రెండ్స్ 24 గంటలు నాతోనే ఉండేవారు' అని ఇటీవల షమీ తన బాధను పంచుకున్నాడు.

Story first published: Thursday, May 7, 2020, 20:43 [IST]
Other articles published on May 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X