షమీని ఐపీఎల్‌లో ఆడనివ్వొద్దంటోన్న హసీన్ జహాన్

Posted By:
Mohammed Shami’s wife asks Delhi Daredevils owners to not field him in IPL 11: Report

హైదరాబాద్: షమీ క్రికెట్ కెరీర్ బ్రేక్ ఇవ్వాలంటూ అతని భార్య హసీన్ జహాన్ ఆరోపిస్తోంది. వారిద్దరి మధ్య వివాదాలు పరిష్కరించుకునేంత వరకు క్రికెట్ మ్యాచ్ లు ఆడనివ్వకూడదంటూ అతని భార్య మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో బీసీసీఐ జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేశాడు.

అయినా, ఈ ఐపీఎల్ సీజన్‌లో తన భర్త షమీపై నిషేధం విధించాలని కోరుతూ హసీన్ జహాన్.. శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈఓ హేమంత్ దువాను కలిసింది. ఎలాగైనా సరే అతడిని ఆడకుండా చేయాలని కోరిందట.

అనంతరం జాతీయ మీడియాతో హసీన్ జహాన్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్ ఢిల్లీ ఫ్రాంచైజీ యజమాని హేమంత్ దువాని కలిశాను. నా భర్త షమీని ఈ ఐపీఎల్ సీజన్లో ఆడించవద్దని కోరాను. మా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు, షమీపై నమోదైన కేసుల వ్యవహారం తేలేంతవరకు షమీని ఢిల్లీ జట్టుకు దూరం చేయాలని' ఆ ఫ్రాంచైజీ సీఈఓను కోరినట్లు వివరించింది.

పాకిస్తాన్ యువతి నుంచి డబ్బులు తీసుకుని ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధికారులు షమీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో డెహ్రడూన్‌ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై షమీ గాయపడ్డాడు. అతనిని పరామర్శించేందుకు వెళ్లిన అతని భార్యను షమీని కలిసేందుకు క్రికెటర్ నిరాకరించాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 1, 2018, 15:52 [IST]
Other articles published on Apr 1, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి