టార్చర్, చంపేందుకు యత్నం: క్రికెటర్ షమీ అక్రమ సంబంధాలపై భార్య సంచలన వ్యాఖ్యలు

Posted By:
Mohammad Shami in trouble, wife Hasin Jahan accuses him of having extra-marital affairs | Oneindia
Mohammed Shami's wife accuses him of having multiple extra-marital affairs, domestic violence

హైదరాబాద్: టీమిండియా ఆటగాడు మహమ్మద్‌ షమిపై ఆయన భార్య హాసిన్‌ జహాన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్‌ జాహన్‌ బట్టబయలు చేశారు. పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్‌ స్క్రీన్‌ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. వీటన్నిటినీ ఆమె షమీ ఫోన్‌ నుంచి సేకరించినట్లు తెలుస్తోంది.

తాజాగా హాసిన్‌ మీడియాతో మాట్లాడుతూ..'గత రెండేళ్ల నుంచి షమితో పాటు ఆయన కుటుంబసభ్యులు నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. అంతేకాదు నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే షమికి ఎంతో మంది అమ్మయిలతో సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం నాకు తెలియడంతో నన్ను వేధించడం మొదలుపెట్టారు' అని హసిన్‌ చెప్పారు.

 చాలా మందితో అక్రమ సంబంధాలు

చాలా మందితో అక్రమ సంబంధాలు

దేశంలో చాలా మంది అమ్మాయిలతో షమికి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆమె తెలిపింది. ఒక రోజు షమి కారులో మొబైల్‌ ఫోన్‌ దొరికిందట. అది ఓ చానెల్‌ తెలిపిన వివరాల ప్రకారం 2014లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది ఆమెకు దొరకడంతో వ్యవహారం బయటకొచ్చింది.

 ఫోన్ నిండా అవే ఫోటోలు, మెసేజ్‌లు

ఫోన్ నిండా అవే ఫోటోలు, మెసేజ్‌లు

ఫోన్ ఓపెన్‌ చేసి చూడగానే అసభ్యకర సందేశాలు కనిపించాయట. చాలా మంది అమ్మాయిలతో పాటు వారి పంపిన ఫొటోలు కనిపించాయని ఆమె తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయితో షమికి పెళ్లి అయిపోయిందని ఆమె వాపోయింది. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ అనంతరం షమి ఆ అమ్మాయి కోసం పాకిస్థాన్‌ కూడా వెళ్లాడని వివరించింది.

 నన్ను మాత్రం దూరంగానే ఉంచుతాడు

నన్ను మాత్రం దూరంగానే ఉంచుతాడు

'గతంలో ధర్మశాలలో టీమిండియా మ్యాచ్‌కు నన్ను తీసుకెళ్లమని షమిని కోరాను. అతడు వద్దన్నాడు. అక్కడితో ఊరుకోకుండా అక్కడి నుంచి నాకు ఫోన్‌ చేసి మరీ నన్ను తిట్టాడు. టీమిండియా ఎక్కడికి వెళ్లినా కుల్‌దీప్‌ అనే వ్యక్తి.. షమికి అమ్మాయిలను సప్లై చేస్తాడు. బీసీసీఐకి ఈ విషయం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు'అని హాసిన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 షమీ, జహాన్‌లది ప్రేమ వివాహం

షమీ, జహాన్‌లది ప్రేమ వివాహం

‘త్వరలో షమితో పాటు ఆయన కుటుంబసభ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా' అని ఆమె తెలిపారు. షమి-హాసిన్‌ది ప్రేమ వివాహం. 2014 జూన్‌ 6న వీరు పెళ్లి చేసుకున్నారు. 2012లో ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో షమి తొలిసారి హాసిన్‌ను చూశాడు. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప.

 షమీ స్పందన

షమీ స్పందన

ఈ ఆరోపణలపై మహ్మద్‌ షమీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టి పారేశాడు. తనపై వచ్చిన అభియోగాలన్నీ అసత్యమని, ఆటపై దృష్టి సారించకుండా తన కెరీర్‌ను నాశనం చేయాలనే ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని షమీ పేర్కొన్నాడు. అయితే షమీ ట్వీట్‌ చేసిన మరికొద్ది క్షణాల్లోనే హాసిన్‌ జాహన్‌ పోస్ట్‌ చేసిన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ డీయాక్టివేట్‌ కావడం చర్చనీయాంశమైంది.

తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా:

‘హాయ్‌. నేను మహమ్మద్‌ షమిని. నా వ్యక్తిగత జీవితం గురించి ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో ఏమాత్రం నిజం లేదు. నాపై జరుగుతున్న కుట్ర ఇది. నా క్రికెట్‌ జీవితాన్ని నాశనం చేసేందుకే ఎవరో ఇదంతా చేస్తున్నారు'

Story first published: Wednesday, March 7, 2018, 13:54 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి