'మిస్ యూ బెబొ' అంటూ షమీ ట్వీట్, మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన షమీ భార్య

Posted By:
Mohammed Shami gets emotional amid wife Hasin Jahan's adultery allegations

హైదరాబాద్: వరుసగా భార్య చేస్తున్న ఆరోపణలపై మూడు రోజులుగా స్పందిస్తోన్న మొహమ్మద్ షమీ తాజాగా ఓ ట్వీట్ చేసి సానుకూలమైన సందేశాన్ని ఒకటి పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్‌లో అతని కూతురు ఫొటో ఉంచి 'చాకొలెట్ లవర్.. మిస్ యు బెబో' చాకొలెట్ లవర్ మిస్ యు పాపా అంటూ మెసెజ్ చేశాడు. దాంతో పాటుగా ఇంకొక ట్వీట్ చేసి తనను సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు.

ఇదిలా ఉండగా, షమీ భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న అతని భార్య మీడియాపై విరుచుకుపడ్డారు. కెమెరాలను ఎత్తి పడేశారు. మార్చి 6 నుంచి సానుకూలంగా స్పందిస్తూ మీడియా ముందు ఆవేదన వెల్లగక్కుతన్న జహాన్ ఉన్నట్టుండి ఆవేశానికి లోనైయ్యారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన ధోనీ .. షమీ అలాంటి వాడు కాదని, అతను దేశానికి, భార్యకు ద్రోహం చేసే వ్యక్తిత్వం లేదని పేర్కొన్నాడు. ఇది అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని మాట్లాడదగినది కాదని, కానీ తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తోందని పేర్కొన్నాడు.

ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీ దాదాపు బీసీసీఐ, ఐపీఎల్ ద్వారా రూ. 12కోట్లు కోల్పోయాడు. ఐపీఎల్ తరపున కొనుగోలు అయిన షమీ ఈ విషయం వెలుగులోకి రావడంతో అతను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపున ఆడతాడా అనేది సందిగ్ధంగానే ఉంది. తన భార్య ఫేస్‌బుక్ ఖాతా ద్వారా మార్చి 6న అతని ఫోన్ నుంచి స్క్రీన్ షాట్‌లను
షేర్ చేస్తుండటంతో అతనిపై తీవ్ర విమర్శలు మొదలైయ్యాయి.

మాజీ మోడల్ అయిన హసీన్ జహాన్‌ను షమీ ఉత్తరప్రదేశ్‌లో 2014లో వివాహమాడాడు. ఆమె అతనిపై ఆరోపణలు గుప్పిస్తూ.. షమీ ఒక మహిళ గురించి డబ్బులు తీసుకున్నాడని అదొక రకంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడే యోచనలో జరిగి ఉండొచ్చని పేర్కొంది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు షమీ సెల్ ఫోన్‌ను సీజ్ చేశారు. అనంతరం అతని విదేశీ పర్యటనలో భాగంగా వెళ్లిన దక్షిణాఫ్రికా వివరాలు కావాలంటూ బీసీసీఐకు లేఖ రాశఆరు.

Story first published: Tuesday, March 13, 2018, 12:38 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి