షమీకి 50మంది మహిళలతో సంబంధాలు, గృహ హింస కేసు నమోదు

Posted By:
Mohammed Shami Charged With Attempt To Murder After Complaint By Wife Hasin Jahan

హైదరాబాద్: షమీ రాచకార్యాలను ఒకొక్కటిగా బయటపెడుతున్న అతని భార్య జహాన్ ఏకంగా 50 మంది మహిళలతో అతనికి సంబంధం ఉందంటూ మీడియా ముందు వెల్లడించింది. ఓ ఇంగ్లిష్ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ ఆరోప‌ణ‌లు చేసింది. ష‌మికి వివాహేత‌ర సంబంధాలు ఉన్న‌ట్లు ఆమె గ‌తంలో చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే అత‌నికి సుమారు 50 మంది మ‌హిళ‌ల‌తో సంబంధాలు ఉన్న‌ట్లు ఈ ఇంట‌ర్వ్యూలో హ‌సీన్ వెల్ల‌డించింది.

అందులో స్వదేశీయులూ, విదేశీ మ‌హిళ‌లు కూడా ఉన్న‌ట్లు ఆమె చెప్పింది. చాలా మంది మ‌హిళ‌ల‌తో షమి అస‌భ్య‌క‌రంగా చాటింగ్ చేశాడ‌ని కూడా ఆరోపించింది. ఓసారి ఇంట్లో త‌మ బీఎండ‌బ్ల్యూ కారు ప‌త్రాలు మిస్ అయ్యాయ‌ని, వాటిని వెతుకుతున్న స‌మ‌యంలోనే ష‌మికి చెందిన హెచ్‌టీసీ ఫోన్ ఒక‌టి బ‌య‌ట‌ప‌డింద‌ని హ‌సీన్ చెప్పింది. ఆ ఫోన్‌తోనే ష‌మి బాగోతం మొత్తం బ‌య‌ట‌ప‌డింద‌ని ఆమె తెలిపింది. ఆ ఫోన్ కాసేపు క‌నిపించ‌క‌పోయే స‌రికి ష‌మి చాలా కంగారు ప‌డ్డాడ‌ని కూడా ఆమె చెప్పింది.

ఈ అక్ర‌మ సంబంధాల గురించి ష‌మిని నిల‌దీస్తే త‌న‌ను బెదిరించాడ‌ని, అప్ప‌టి నుంచి త‌న‌ను ఇంకా ఎక్కువ‌గా హింసించ‌డం మొదలుపెట్టాడ‌ని హ‌సీన్ తెలిపింది. ఈ విష‌యంలో త‌న‌కు ఎవ‌రి సాయం అంద‌లేద‌ని ఆమె ఆరోపించింది. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే తాను ఫేస్‌బుక్‌లో ఈ విష‌యాల‌న్నీ వెల్ల‌డించిన‌ట్లు చెప్పింది.

అయితే ఫేస్‌బుక్ త‌న అకౌంట్‌ను బ్లాక్ చేసింద‌ని, ఆ పోస్ట్‌ల‌న్నింటినీ డిలీట్ చేసింద‌ని, త‌న అనుమ‌తి లేకుండా అలా ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించింది. హ‌సీన్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ష‌మిపై కోల్‌క‌తా పోలీసులు హ‌త్యాయ‌త్నం, గృహ‌హింస కేసుల‌ను పెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ఆరోప‌ణ‌ల‌ను ష‌మి ఖండించాడు. అయితే అత‌ను ఈ సీరియ‌స్ కేసులో చిక్కుకోవ‌డంతో అటు బీసీసీఐ కూడా తాజా కాంట్రాక్టుల్లో ష‌మి పేరును తొల‌గించింది.

Story first published: Friday, March 9, 2018, 18:18 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి