న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్ర‌పంచ‌క‌ప్‌లో హ్యాట్రిక్‌: ఆరంభం మ‌నోళ్ల‌తోనే! ఆ జాబితా ఇదే!

Mohammed Shami 2nd Indian to take World Cup hat-trick

సౌతాంప్టన్‌: ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా.. ఇంగ్లండ్ సౌతాంప్ట‌న్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో ఆఫ్ఘ‌నిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా ఘ‌న విజయం సాధించడంలో పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ కీల‌క పాత్ర పోషించాడు. చివ‌రి ఓవ‌ర్‌లో అతను హ్యాట్రిక్ సాధించాడు. చివ‌రి ముగ్గురు బ్యాట్స్‌మెన్ల‌ను మూడు బంతుల్లో ప‌డ‌గొట్టాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌల‌ర్ ష‌మీ. ఇదివ‌ర‌కు ఫాస్ట్ బౌల‌ర్ చేత‌న్ శ‌ర్మ హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో హ్యాట్రిక్ తీసుకోవ‌డానికి ఆద్యులు మ‌నోళ్లే. చేత‌న్ శ‌ర్మ‌తోనే ఈ ఫీట్ ఆరంభ‌మైంది. ష‌మీతో క‌లుపుకొని మొత్తం 10 మంది బౌల‌ర్లు హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్నారు.

ఆఫ్ఘ‌న్‌..బౌలింగ్ ప‌రాక్ర‌మం! ష‌మీ హ్యాట్రిక్‌: మ్యాచ్ మొత్తానికీ రెండే సిక్స‌ర్లు!ఆఫ్ఘ‌న్‌..బౌలింగ్ ప‌రాక్ర‌మం! ష‌మీ హ్యాట్రిక్‌: మ్యాచ్ మొత్తానికీ రెండే సిక్స‌ర్లు!

32 ఏళ్ల త‌రువాత‌..

32 ఏళ్ల త‌రువాత‌..

1987 ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలి హ్యాట్రిక్ న‌మోదైంది. భార‌త క్రికెట్ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ చేత‌న్ శ‌ర్మ ఈ ఘ‌న‌త‌ను అందుకున్న మొట్ట‌మొద‌టి బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. మూడు వ‌రుస బంతుల్లో మూడు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు చేత‌న్ శ‌ర్మ‌. ఆ మూడు వికెట్లు కూడా క్లీన్ బౌల్డ్ కావ‌డం విశేషం. 32 ఏళ్ల త‌రువాత మ‌హమ్మ‌ద్ ష‌మీ హ్యాట్రిక్‌ను న‌మోదు చేశాడు. ఈ హ్యాట్రిక్‌లో ఓ క్యాచ్ అవుట్‌, మిగిలిన‌వి క్లీన్ బౌల్డ్ ఉన్నాయి. అప్ఘ‌నిస్తాన్ జట్టు త‌న చివరి ఓవ‌ర్‌లో విజ‌యానికి 16 ప‌రుగులు చేయాల్సి ఉన్న ద‌శ‌లో ఈ హ్యాట్రిక్ న‌మోదైంది. చివ‌రి ఓవ‌ర్‌ను వేయ‌డానికి ష‌మీని బ‌రిలో దింపాడు కోహ్లీ. ష‌మీ చివ‌రి ఓవ‌ర్ తొలి బంతిని బౌండ‌రీ దాటించాడు బ్యాట్స్‌మెన్ మ‌హ‌మ్మ‌ద్ న‌బీ.

 అయిదు బంతుల్లో 12 ప‌రుగులు..

అయిదు బంతుల్లో 12 ప‌రుగులు..

దీనితో ఆఫ్ఘ‌న్ విజ‌యానికి అయిదు బంతుల్లో 12 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. రెండో బంతికి ప‌రుగులు రాలేదు. మూడో బంతిని నబీ భారీ షాట్ కొట్టాడు. స‌రిగ్గా క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో గాల్లోకి లేచిందా బంతి. నేరుగా వెళ్లి హార్దిక్ పాండ్య చేతుల్లో ప‌డింది. ఈ ఫోర్‌తోనే అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు న‌బీ. అత‌ను అవుటైన త‌రువాత క్రీజ్‌లోకి వ‌చ్చిన ఆప్థాబ్ ఆల‌మ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు ష‌మీ. అది అత‌ని నుంచి వెలువ‌డిన నాలుగో బంతి. ఖ‌చ్చిత‌మైన లైన్ అండ్ లెగ్త్ వేసిన ష‌మీ బంతిని పొర‌పాటుగా అంచ‌నా వేశాడు. బ్యాట్‌ను అడ్డు పెట్టేలోగా.. అది వికెట్ల‌ను గిరాటేసింది.

 అయిదో బంతికి ముజీబుర్‌..ప‌ర్‌ఫెక్ట్ యార్క‌ర్‌!

అయిదో బంతికి ముజీబుర్‌..ప‌ర్‌ఫెక్ట్ యార్క‌ర్‌!

టీమిండియా విజ‌యంపై పిస‌రంత అనుమానాలు కూడా లేవు. అయిన‌ప్ప‌టికీ.. ప్రేక్షకుల్లో ఒక‌టే టెన్ష‌న్‌. కార‌ణం- హ్యాట్రిక్ తీస్తాడా? లేడా? అనే ఆందోళ‌న అభిమానుల్లో నెల‌కొంది. హ్యాట్రిక్ బంతిని సంధించ‌డానికి రెడీ అయ్యాడు ష‌మీ. అప్ప‌టికే టీమిండియా విజ‌యం ఖాయ‌మైపోయింది. ఇక అంద‌రి దృష్టీ హ్యాట్రిక్ మీదే. వికెట్ తీయాలంటే సాధార‌ణంగా ప్ర‌తి ఫాస్ట్ బౌల‌ర్ ప్ర‌ధానంగా ఆధార‌ప‌డేది యార్క‌ర్ మీదే. ఒక్క ప‌ర్‌ఫెక్ట్ యార్క‌ర్ ప‌డిందంటే చాలు! బెయిల్స్ గాల్లోకి లేస్తాయి. ష‌మీ విష‌యంలో అదే జ‌రిగింది. అయిదో బంతిని యార్క‌ర్‌గా సంధించాడు. ఏ మాత్రం తేడా కొట్ట‌లేదు ఆ బంతి. ముజీబుర్ బ్యాట్ అడ్డు పెట్టేలోగా బుల్లెట్‌లాగా వెళ్లి వికెట్ల‌ను తాకింది. అంతే! అభిమానుల‌ హ‌ర్షాధ్వానాలతో రోజ్‌బౌల్ స్టేడియం మారుమోగిపోయింది.

టీమిండియా త‌ర‌ఫున రెండో బౌల‌ర్‌.. మొత్తంగా!

టీమిండియా త‌ర‌ఫున రెండో బౌల‌ర్‌.. మొత్తంగా!

ఇప్ప‌టిదాకా ప్ర‌పంచ‌క‌ప్‌లో తొమ్మిదిమంది బౌల‌ర్లు హ్యాట్రిక్‌ను సాధించారు. ఆ క్ల‌బ్‌లో ప‌దో ఆట‌గాడిగా చేరాడు ష‌మీ. 1987లో చేత‌న్ శ‌ర్మ న్యూజీలాండ్‌పై తొలిసారిగా హ్యాట్రిక్ తీశాడు. ఆ త‌రువాత పాకిస్తాన్ లెజెండ‌రీ స్పిన్న‌ర్ సక్లయిన్ ముస్తాక్ 1999 ప్ర‌పంచ‌క‌ప్‌లో జింబాబ్వే హ్యాట్రిక్‌ను న‌మోదు చేశాడు. 2003లో శ్రీలంక పేస్ బౌల‌ర్ చ‌మిందా వాస్ బంగ్లాదేశ్‌పై, అదే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌల‌ర్ బ్రెట్ లీ కెన్యాపై హ్యాట్రిక్ వికెట్ల‌ను ప‌డ‌గొట్టారు. 2007లో శ్రీలంక బౌల‌ర్ లసిత్ మలింగ.. దక్షిణ ఆఫ్రికాపై ఈ ఫీట్ సాధించాడు. 2011లో విండీస్ బౌల‌ర్ కీమ‌ర్ రోచ్‌, నెద‌ర్లాండ్స్‌పై, లసిత్ మలింగ అదే ప్ర‌పంచ‌క‌ప్‌లో కెన్యాపై రెండోసారి హ్యాట్రిక్ తీసుకున్నారు. 2015లో స్టీవెన్ ఫిన్ (ఇంగ్లండ్) ఆస్ట్రేలియాపై, అదే ప్రపంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా స్పిన్న‌ర్ జేపీ డుమిని శ్రీలంకపై హ్యాట్రిక్ న‌మోదు చేశారు.

Story first published: Sunday, June 23, 2019, 11:57 [IST]
Other articles published on Jun 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X