న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రస్తుత తరంలో కోహ్లీనే నెం.1.. అత్యుత్తమ కెప్టెన్ మాత్రం..

Mohammad Yousuf names his favourite cricketers of all time

కరాచీ: కరోనా కారణంగా టోర్నీలన్నీ రద్దవ్వడం.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశాలన్నీ లాక్‌డౌన్ పాటించడంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా కాలక్షేపం చేస్తున్నారు. లైవ్ ఇంటరాక్షన్స్‌తో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు.

బెస్ట్ కెప్టెన్ విలియమ్సన్..

బెస్ట్ కెప్టెన్ విలియమ్సన్..

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ ట్విటర్ వేదికగా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. అయితే ప్రస్తుత తరంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరనీ ఓ అభిమాని ప్రశ్నించగా.. ఈ పాక్ మాజీ ఆటగాడు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ పేరు చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్నవారిలో అతనే అత్యుత్తమ కెప్టెన్‌ అని తెలిపాడు.

సచిన్‌, లారా ఆల్‌టైమ్ బెస్ట్..

సచిన్‌, లారా ఆల్‌టైమ్ బెస్ట్..

తన ఆల్‌టైమ్ అత్యుత్తమ క్రికెటర్స్ ఎవరనీ ప్రశ్నించగా.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్, విండీస్ వీరుడు బ్రియాన్ లారా పేర్లను సూచించాడు. ఇక ప్రస్తుత తరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ‌ అత్యుత్తమ క్రికెటర్ అని మహ్మద్ యూసుఫ్ అభిప్రాయపడ్డాడు. ఓ అభిమాని.. విరాట్ కోహ్లీ గురించి ఒక్కమాటలో చెప్పండి అంటూ మహ్మద్ యూసఫ్‌ను ప్రశ్నించాడు. దీనికి ‘ప్రస్తుతం అతనే నెం.1.. గొప్ప ఆటగాడు అంటూ యూసుఫ్ సమాధానం ఇచ్చాడు.

టాప్ సచినే..

టాప్ సచినే..

ఇక బ్రియన్ లారా, రిక్కీ పాంటింగ్‌ల కంటే సచిన్‌ టెండూల్కరే గొప్ప క్రికెటర్ అని ఈ పాక్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. టెండూల్కర్, లారా, పాంటింగ్, సంగక్కరా, జాక్వెస్ కల్లీస్ లలో ఎవరు ఉత్తమ బ్యాట్స్‌మెన్ ప్రశ్నకు.. ‘నెం.1 సచిన్, నెం.2 లారా, నెం.3 పాంటింగ్, నెం.4 కల్లీస్, నెం.5 సంగక్కరా' అని యూసఫ్ సమాధానం ఇచ్చాడు.

పాకిస్థాన్ తరఫున 90 టెస్టులు ఆడిన యూసఫ్.. 24 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో 7530 పరుగులు చేశాడు. ఇక 288 వన్డేల్లో 15 సెంచరీ, 64 హాఫ్ సెంచరీలతో 9720 రన్స్ నమోదు చేశాడు. చివరిసారిగా 2010లో సౌతాఫ్రికాతో దుబాయ్ వేదికగా జరిగిన వన్డేలో ఆడాడు.

ఆ టార్చర్ తట్టుకోలేక మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: షమీ

Story first published: Sunday, May 3, 2020, 15:21 [IST]
Other articles published on May 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X