న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ టార్చర్ తట్టుకోలేక మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: షమీ

Mohammed Shami Says Thought of committing suicide three times due to severe stress and personal problems
Mohammed Shami Revealed Darkest Moments In His Life With Rohit Sharma | Oneindia Telugu

న్యూఢిల్లీ: జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న తాను ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు భారత స్టార్ పేసర్‌ మహ్మద్ షమీ వెల్లడించాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మతో కలిసి శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్న షమీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఫ్రొఫెషనల్, వ్యక్తిగత సమస్యలతో సతమతమైన తాను ఆ ఒత్తిడిని తట్టుకోలేక మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఈ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు.

షమీ భార్య సంచలన ఆరోపణలు..

షమీ భార్య సంచలన ఆరోపణలు..

రెండేళ్ల క్రితం షమీ భార్య హాసిన్ జహాన్ అతనిపై సంచలన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షమీ స్త్రీలోలుడని, అతని కుటుంబం ఆమెను అనేక ఇబ్బందులు గురిచేసిందని, లైంగికంగా కూడా వేదించారిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలు సమర్పించి క్రికెట్‌లో వచ్చాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు షమీ, అతని సోదరుడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. హాసిన్ ఆరోపణలతో విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతను ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చింది.

వరుస సమస్యలు..

వరుస సమస్యలు..

తాజాగా రోహిత్‌తో ఇదే విషయాన్ని గుర్తు చేసుకొని షమీ ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు, ప్రతీ విషయం మీడియాలో సెన్సేషన్ కావడం, అదే సమయంలో తాను రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో తీవ్రంగా బాధపడ్డానన్నాడు. ఈ ప్రమాదం కూడా ఐపీఎల్‌కు ముందే 10-12 రోజుల ముందే జరగడంతో తన కెరీర్‌ గందరగోళంలో పడిందన్నాడు. ఈ వరుస సమస్యలతో అల్లాడిన తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు గుర్తు చేసుకున్నాడు.

నా ఫ్యామిలీ లేకుంటే..

నా ఫ్యామిలీ లేకుంటే..

‘రోజు రోజుకు పెరుగుతున్న సమస్యలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. అప్పుడే కుటుంబ సమస్యలు, దానికి తోడు రోడ్డు ప్రమాదం. అది కూడా ఐపీఎల్‌కు 10-12 రోజుల ముందు. అలాగే నా వ్యక్తిగత విషయాలు మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆ సమయంలో నా కుటుంబమే అండగా లేకుంటే ఈ రోజు నేనిలా ఉండేవాడిని కాదు. మళ్లీ క్రికెట్ ఆడేవాడిని కాదు. వరుసగా ఎదురైన సమస్యలతో మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. కానీ నా కుటుంబం మద్దతుగా నిలవడంతో సమస్యల నుంచి గట్టెక్కా.

బాల్కానీ నుంచి దూకేస్తానని..

బాల్కానీ నుంచి దూకేస్తానని..

వ్యక్తిగత సమస్యలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యా. ఆ సమయంలో క్రికెట్‌పై ఆలోచన కూడా రాలేదు. మేమంతా అప్పుడు 24వ అంతస్థులో ఉండేవాళ్లం. నేను బాల్కనీ నుంచి దూకేస్తానేమోనని నా కుటుంబం ప్రతీ క్షణం భయపడేది. నా సోదరుడు చాలా మద్దతుగా నిలిచాడు. నా ఫ్రెండ్స్ 24 గంటలు నాతోనే ఉండేవారు. క్రికెట్‌పై ఫోకస్ పెట్టేమని, అప్పుడే పరిస్థితులు అనుకూలంగా మారుతాయని నా తల్లిదండ్రులు చెప్పేవారు. నేను కూడా ఆ కోపాన్ని, ఒత్తిడిని డెహ్రాడూన్‌లోని అకాడమీలో నా ప్రాక్టీస్‌పై చూపించాను. 'అని షమీ తన బాధను పంచుకున్నాడు.

2015 వరల్డ్‌కప్‌ సందర్భంగా అయిన గాయం నుంచి కోలుకొనేందుకు తనకు 18 నెలల సమయం పట్టిందని, తన జీవితంలో ఇది కూడా అత్యంత బాధను మిగిల్చిన సందర్భమని ఈ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు.

ఎందుకు పరిగెట్టలేకపోతున్నావ్‌ అని లక్ష్మణ్‌పై అరిచా.. తర్వాత మా అన్నయ్య తిట్టాడు: సచిన్

Story first published: Sunday, May 3, 2020, 10:00 [IST]
Other articles published on May 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X