న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన ఆఫ్ఘన్ సారధి.. రాజీనామా లేఖలో సంచలన ఆరోపణలు!

Mohammad Nabi reveals shocking details as he steps down as Afghanistan team captain

టీ20 ప్రపంచకప్‌లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నీని ముగించిన ఏకైక జట్టు ఆఫ్ఘనిస్తాన్. ఈ జట్టు కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా గెలుస్తుందని అభిమానులు భావించారు. రహ్మనుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లు.. ఆ జట్టు కెప్టెన్ మహమ్మద్ నబీ కూడా సత్తా ఉన్న ఆటగాడే. ఇలాంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్న జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

ప్రపంచకప్‌లో వెంటాడిన బ్యాడ్ లక్

ప్రపంచకప్‌లో వెంటాడిన బ్యాడ్ లక్

జట్టులోని అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన ఆటగాళ్లు ఉన్న ఆఫ్ఘన్ జట్టును ఈ ప్రపంచకప్‌లో దురదృష్టం వెంటాడింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పేలవ ప్రదర్శన చేసిన ఆ జట్టు ఓటమి చవి చూసింది. రెండో మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకోవాలని భావించింది. కానీ ఆ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుకట్ట వేశాడు. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఆ మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత కూడా ఆఫ్ఘన్ జట్టును వర్షం వెంటాడింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. తన నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకతో ఆడిన ఆ జట్టు.. మరోసారి ఓటమినే చవిచూసింది.

ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు..

ఆస్ట్రేలియాకు ముచ్చెమటలు..

ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా తన వద్ద గెలిచే సత్తా ఉందని మాత్రం ఆఫ్ఘనిస్తాన్ టీం నిరూపించింది. టోర్నీలో తన చివరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడి, ఆ జట్టు ఓడించినంత పని చేసింది. ముఖ్యంగా రషీద్ ఖాన్ (48 నాటౌట్) ఆస్ట్రేలియాకు షాకిచ్చేలా కనిపించాడు. కానీ చివరి రెండు బంతుల్లో 11 పరుగులు కావలసి ఉండగా.. అతను గాల్లోకి లేపిన బంతి బౌండరీ చేరలేకపోయింది. చివరి బంతికి కేవలం ఫోర్ మాత్రమే రావడంతో నాలుగు పరుగుల తేడాతో ఆఫ్ఘన్ జట్టు ఓడింది.

మహమ్మద్ నబీ రాజీనామా..

టీ20 ప్రపంచకప్‌లో ఒక్క విజయం కూడా లేకుండా ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిష్క్రమించడంతో ఆ జట్టు సారధి మహమ్మద్ నబీ తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. కొంతకాలంగా టీం మేనేజ్‌మెంట్, సెలెక్టర్లతో తన ఆలోచనలు సరిపోవడం లేదని, ఇది జట్టు కూర్పుపై ప్రభావం చూపిందని నబీ ఆరోపించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత తన ట్విట్టర్ ఖాతాలో రాజీనామా లేఖను ఉంచిన అతను.. దానిలో షాకింగ్ విషయాలు చెప్పాడు. 'టీ20 ప్రపంచకప్‌లో మేం కానీ, అభిమానులు కానీ ఆశించని విధంగా మా ప్రయాణం ముగిసింది. ఈ టోర్నీకి మా ప్రిపరేషన్స్ ఒక కెప్టెన్‌కు సంతృప్తినిచ్చే స్థాయిలో లేవు. జట్టు మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు, నేను చాలా విషయాల్లో ఏకాభిప్రాయానికి కూడా రాలేకపోయాం. అది కూడా జట్టుపై ప్రభావం చూపింది. అందుకే కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నా. సెలెక్టర్లు నన్ను ఎంపిక చేస్తే ఆటగాడిగా దేశానికి సేవలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను' అని నబీ పేర్కొన్నాడు.

Story first published: Saturday, November 5, 2022, 10:10 [IST]
Other articles published on Nov 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X