న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కైఫ్ నీ మతమేంటో గుర్తులేదా..?: నాటుగా స్పందిస్తున్న నెటిజన్లు

Mohammad Kaif posts Christmas celebration photos on social media, gets trolled

హైదరాబాద్: మొహమ్మద్ కైఫ్ మళ్లీ నెటిజన్ల ఆగ్రహానికి గురైయ్యాడు. కాదు తను ఏ ఉద్దేశ్యంతో చేశాడో కానీ, పాపం బలైయ్యాడు. కైఫ్ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నట్లు ఉన్న ఫొటోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచాడు. దానికి స్పందించిన కొందరు నిజమైన భారతీయుడిలా చేశావ్. అని పొగుడుతున్నారు. మరికొందరు మత సంబంధిత ప్రస్తావన తీసుకొస్తూ ఘోరంగా తిడుతున్నారు.

కైఫ్ చేసుకున్న పండగ ఏమో కానీ, అతని ట్వీట్‌తో పనిలేని వాళ్లందరికీ పని కల్పించిన వాడైయ్యాడు. పరస్పర వాదనలకు దిగుతూ ఆన్‌లైన్లోనే వాదనకు దిగుతున్నారు. కైఫ్ నీ మతమేంటో తెలుసుకోముందు అని కొందరు వెక్కిరిస్తుంటే, మరికొందరు నీ తాత మతం మార్చుకున్నాడా అని ప్రశ్నిస్తున్నారు.

ఈ పోస్ట్ తీసేయాలంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. అస్సలివేమీ పట్టని వాళ్లు మాత్రం క్రిస్మస్ శుభాకాంక్షలకు బదులుగా నీకు, నీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ బదులిస్తున్నారు.

Merry Christmas !

A post shared by Mohammad Kaif (@mohammadkaif87) on

కైఫ్‌ నెటిజన్ల ఆగ్రహానికి గురవ్వడం ఇది తొలిసారేం కాదు. గతంలో యోగా చేస్తూ సూర్యనమస్కారాలు పెట్టడం, కొడుకుతో చెస్‌ ఆడుతున్నఫొటోలతో విమర్శలకు గురయ్యాడు. వీటన్నిటికి స్ట్రాంగానే రిప్లే ఇచ్చిన కైఫ్‌ తాజా కామెంట్లకు ఎలా స్పందిస్తాడో​ చూడాలి మరి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 26, 2017, 17:49 [IST]
Other articles published on Dec 26, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X