న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

12 ఏళ్ల క్రితం చివరి మ్యాచ్: క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కైఫ్

By Nageshwara Rao
Mohammad Kaif Announces Retirement From Competitive Cricket
Mohammad Kaif announces retirement from competitive cricket

హైదరాబాద్: టీమిండియా తరుపున చివరిసారిగా 12 ఏళ్ల క్రితం మ్యాచ్ ఆడిన మొహమ్మద్ కైఫ్ శుక్రవారం (జులై 13)న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలహాబాద్‌కు చెందిన కైఫ్ భారత జట్టులో మంచి ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే కైఫ్ భారత్‌ సాధించిన అనేక విజయాల్లో పాలు పంచుకున్నాడు.

37 ఏళ్ల కైఫ్ టీమిండియా తరుపున 13 టెస్టులు, 125 వన్డేలాడాడు. 2002లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో కైఫ్ బాదిన 87 పరుగులు ఇప్పటికీ ప్రతి భారత అభిమానికి గుర్తే. తన రిటైర్మెంట్‌పై బీసీసీఐ తాత్కాలిక ప్రెసిడెంట్ సీకే ఖన్నా, సెక్రటరీ అమితాబ్ చౌదరికి కైఫ్ ఈ మెయిల్‌లో వెల్లడించాడు.

"ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నాను" అని ఈ మెయిల్‌లో పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత జట్టులో మహమ్మద్ కైఫ్ సభ్యుడిగా ఉన్నాడు. 2000లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌తో యువరాజ్ సింగ్, కైఫ్ వెలుగులోకి వచ్చారు.

"చరిత్రాత్మక నాట్‌వెస్ట్‌ ట్రోఫీలో నేను కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నాను. అది జరిగి ఇప్పటికే 16సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో ఈ రోజు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా" అని కైఫ్‌ పేర్కొన్నాడు. అదేవిధంగా భారత క్యాప్‌ ధరించే అవకాశం దక్కినందుకు గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు కైఫ్‌ చెప్పుకొచ్చాడు.

కైఫ్ సారథ్యంలోనే భారత్‌ అండర్‌-19 జట్టు 2000 వరల్డ్‌కప్ గెలిచింది. రంజీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు కైఫ్ రంజీ ట్రోఫీని అందించాడు. చివరిసారిగా ఛత్తీస్‌గడ్ తరుపున రంజీ క్రికెట్ ఆడాడు. తన ఐదేళ్ల క్రికెట్ కెరీర్‌లో కైఫ్ ఎన్నో అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా 30 యాడ్ సర్కిల్‌లో ఫీల్డింగ్‌ చేసిన కైఫ్ భారత్ తరుపున అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు.

125 వన్డేలాడిన కైఫ్ 32 యావరేజితో 2753 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో కైప్ ఎక్కువగా 6 లేదా 7 స్థానాల్లో బరిలోకి దిగేవాడు. ఇక, టెస్టుల విషయానికి వస్తే 13 టెస్టులాడి 624 పరుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక స్కోరు 148 నాటౌట్.

టెస్టుల్లో ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. లార్డ్స్‌లో సెంచరీతోపాటు 2002లో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ విఫలం కావడంతో చివరి వరకు పోరాడి భారత్‌కు విజయాన్ని అందించాడు.

ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడిగా, హిందీ కామేంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై 2000లో టెస్టు అరంగేట్రం చేసిన కైఫ్‌.. మొత్తం 13టెస్టులాడి 32సగటుతో 624పరుగులు సాధించాడు. 2002లో ఇంగ్లాండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన కైఫ్ మొత్తం 125మ్యాచ్‌లాడి 2753 పరుగులు సాధించాడు.

టీమిండియాకు తక్కువ మ్యాచ్‌లాడినా కైఫ్‌ మంచి ఫీల్డర్‌గానూ గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌లోనూ కైఫ్‌ 2013 వరకూ కొనసాగాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులకు ఆడాడు.

Story first published: Friday, July 13, 2018, 18:51 [IST]
Other articles published on Jul 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X