న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: విరాట్ కోహ్లీ ఇలా ఔటవ్వడం ఇదే తొలిసారి.. రికార్డుల్లోకి మొయిన్ అలీ!!

Moeen Ali becomes 1st spinner to dismiss Virat Kohli for a duck in international cricket

చెన్నై: చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (0) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. జట్టు స్కోర్‌ 85 పరుగుల వద్ద చేటేశ్వర్ పుజారా (21) ఔటైన తర్వాతి ఓవర్‌లోనే విరాట్ సైతం పెవిలియన్‌ బాట పట్టాడు. ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన స్పిన్నర్ మొయిన్ అలీ.. రెండో బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా ఊరిస్తూ విసిరాడు. తనదైన శైలిలో కవర్ డ్రైవ్ ఆడేందుకు కోహ్లీప్రయత్నించగా.. బ్యాట్‌, ఫ్యాడ్ మధ్యలో నుంచి వెళ్లిన బంతి ఆఫ్ స్టంప్‌పై ఉన్న బెయిల్‌ని ఎగరగొట్టింది.

ఊహించని విధంగా:

బంతి కీపర్ గ్లౌవ్స్‌ని తాకి వికెట్లపై పడినట్లు భ్రమించిన విరాట్ కోహ్లీ.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మని ఏం జరిగింది? అనేలా చూశాడు. అయితే రోహిత్ నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. కోహ్లీ ఔట్‌పై తుది నిర్ణయం కోసం ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్ సాయం కోరారు. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేరుగా వెళ్లి బెయిల్‌ని తాకినట్లు తేలడంతో ఔట్‌గా ప్రకటించాడు. దీంతో భారత్‌ 86 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ఇక ఊహించని విధంగా కోహ్లీ వికెట్ దక్కడంతో మొయిన్ అలీ మైదానంలో సంబరాలు చేసుకున్నాడు.

ఇదే తొలిసారి:

ఇదే తొలిసారి:

అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలా స్పిన్నర్‌ చేతిలో డకౌటవ్వడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 26 సార్లు (11 సార్లు టెస్టులో డకౌట్ అయ్యాడు) కోహ్లీ డకౌట్ ఔటయ్యాడు. కానీ అందులో ఒక్కసారి కూడా ఏ స్పిన్నర్‌ చేతిలో ఔటవ్వలేదు. దీంతో కోహ్లీని డకౌట్‌ చేసిన తొలి స్పిన్నర్‌గా మొయిన్ అలీ రికార్డుల్లో నిలిచాడు. ఇంతకుముందు 2015లో శ్రీలంకతో జరిగిన గాలే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్‌ తరిండు కౌశల్‌ చేతిలో కోహ్లీ టెస్టుల్లో అత్యల్ప స్కోరుకు ఔట్‌ అయ్యాడు. అప్పడు 3 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అలీనే కోహ్లీని సున్నా పరుగులకు ఔట్‌ చేశాడు.

చెన్నైలోనే మూడు సార్లు:

చెన్నైలోనే మూడు సార్లు:

భారత సారథి విరాట్ కోహ్లీ రెండు వరుస ఇన్నింగ్స్‌ల్లో బౌల్డవ్వడమూ ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ 72 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది. ఇప్పుడు రెండో టెస్టులో అలీ బౌలింగ్‌లో మరోసారి బోల్డ్ అయ్యాడు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన కోహ్లీ.. ఇలా డకౌట్‌గా వెనుతిరిగి అభిమానులను నిరాశపర్చాడు. మరోవైపు కోహ్లీ తన కెరీర్లో చెన్నైలోనే మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఇంతకుముందు ఏ మైదానంలో కూడా కోహ్లీ ఇలా పెవిలియన్ చేరలేదు.

రోహిత్ హాఫ్ సెంచరీ:

రోహిత్ హాఫ్ సెంచరీ:

చెపాక్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్ మూడు వికెట్లు కోల్పోయింది. రెండో ఓవ‌ర్‌లోనే శుభ్‌మ‌న్ గిల్ డ‌కౌట్‌గా వెనుదిర‌గ‌గా.. రోహిత్ శ‌ర్మ, చేటేశ్వర్ పుజారా (21) రెండో వికెట్‌కు 85 ప‌రుగుల విలువైన భాగ‌స్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో రోహిత్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ బాదాడు. అయితే లీచ్ వేసిన బంతిని సరిగా అర్ధం చేసుకోలేక స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పుజారా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన విరాట్ కోహ్లీ(0).. మొయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 86 ప‌రుగుల‌కు మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ స‌మ‌యానికి భార‌త్ మూడు వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులు చేసింది. ఆపై రహానే, రోహిత్ నిలకడగా ఆడుతున్నారు. ప్ర‌స్తుతం క్రీజులో రోహిత్ ( 83), ర‌హానే (17) ఉన్నారు. భారత్ 33 ఓవర్లలో 121 రన్స్ చేసింది.

India vs England: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అభిమానులతో కళకళలాడుతున్న చెపాక్‌ స్టేడియం!! (వీడియో)

Story first published: Saturday, February 13, 2021, 13:43 [IST]
Other articles published on Feb 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X