న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

200 ODIs: భారత్ తరుపున తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రికార్డు

Mithali Raj becomes the first woman cricketer to play 200 ODIs! Watch Reactions

హైదరాబాద్: భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు నెలకొల్పింది. న్యూజిలాండ్‌తో హామిల్టన్ వేదికగా శుక్రవారం జరిగిన మూడో వన్డే‌తో భారత్ తరఫున 200 వన్డేలాడిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 1999, జనవరి 25న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మిథాలీకి ఇది 200వ వన్డే. భారత్ తరుపున 200 వన్డేలాడిన మిథాలీ 51 యావరేజితో 6,622 పరుగులు చేసింది. ఇందులో ఏడు సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ 200 వన్డేల్లో 180 సార్లు బ్యాటింగ్‌కి వెళ్లిన మిథాలీ రాజ్ ఏకంగా 51 సార్లు నాటౌట్‌గా నిలిచిన ఆమె ఆరుసార్లు డకౌట్‌గా వెనుదిరిగింది.

అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమెన్‌గా

ఇప్పటికే మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమెన్‌గా మిథాలీ కొనసాగుతోంది. బ్యాట్స్‌ఉమెన్‌గానే కాకుండా మిథాలీ వన్డే కెప్టెన్‌గా భారత మహిళల జట్టుకు అనేక అద్భుతమైన విజయాలను సాధించింది. ఆమె నేతృత్వంలో టీమిండియా 122 మ్యాచ్‌లాడగా 75 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

85 టీ20 మ్యాచ్‌లాడిన మిథాలీ

ఇప్పటివరకు 85 టీ20 మ్యాచ్‌లాడిన మిథాలీ 2,283 పరుగులు సాధించింది. టీ20ల్లోనూ అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌ మిథాలీనే కావడం విశేషం. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న మిథాలీ రాజ్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరింది.

ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం

కాగా, భారత జట్టుతో జరిగిన ఈ వన్డేలో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు నిర్దేశించిన 150 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 29.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీ సేన క్లీన్‌స్వీప్‌ చేయకుండా న్యూజిలాండ్ అడ్డుకుంది.

149 పరుగులకే ఆలౌటైన భారత మహిళల జట్టు

కాగా, మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే మొదటి రెండు వన్డేల్లో మిథాలీ సేన విజయం సాధించి సిరిస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కివీస్ పేసర్ అన్నా పీటర్సన్‌(4/21) ధాటికి భారత జట్టు 149 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Friday, February 1, 2019, 16:04 [IST]
Other articles published on Feb 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X