న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాక్సింగ్ డే టెస్టులో కివీస్ ఓటమి ఖాయం... అందుకు కారణం అతడే: మార్క్ వా జోస్యం

Mitchell Santner the reason why New Zealand cant win Boxing Day Test: Mark Waugh

హైదరాబాద్: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్‌ పేలవమైన ఆటతీరుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ వా విమర్శించాడు. అతడి కారణంగానే ఈ టెస్టులో న్యూజిలాండ్ ఓడిపోతుందని జోస్యం చెప్పాడు. కివీస్ ఒక అనవసరమైన బౌలర్‌ను తుది జట్టులో ఆడిస్తుందని మార్క్ వా పేర్కొన్నాడు.

బాక్సింగ్ డే టెస్టులో స్పిన్నర్ మిచెల్ సాంట్నర్‌ వల్ల ఒరిగేదేమీ లేదంటూ ఎద్దేవా చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ సాంట్నర్ 20 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 82 పరుగులు సమర్పించుకోవడంతో పాటు ఒక వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. మరోవైపు న్యూజిలాండ్ పేసర్లు మాత్రం ఫరవాలేదనిపించారు.

క్రికెట్ అనేది ఫన్నీ గేమ్ అని... ఇక్కడ ఏదైనా జరగొచ్చు: వన్డేల్లో పునరాగమనంపై రహానేక్రికెట్ అనేది ఫన్నీ గేమ్ అని... ఇక్కడ ఏదైనా జరగొచ్చు: వన్డేల్లో పునరాగమనంపై రహానే

మిచెల్ సాంట్నర్ వన్డే బౌలర్

మిచెల్ సాంట్నర్ వన్డే బౌలర్

తాజాగా ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మార్క్ వా మాట్లాడుతూ "మిచెల్ సాంట్నర్ వన్డే బౌలర్, టెస్ట్ మ్యాచ్ బౌలర్ కాదు. టెస్టు మ్యాచ్‌లకు సరిపోయే బౌలింగ్‌ సామర్థ్యం అతనిలో లేదు. నిజంగా సాంత్నార్‌ మంచి స్నిన్నర్‌ అయితే కచ్చితత్వం ఉండాలి. మరి అతనిలో అది లేదు. సాంట్నర్ ఎక్కువగా బంతిని స్పిన్‌ చేయలేడు" అని అన్నాడు.

టెస్టుల్లో బంతి ఎక్కువగా స్పిన్న్‌ అయితేనే

టెస్టుల్లో బంతి ఎక్కువగా స్పిన్న్‌ అయితేనే

"టెస్టుల్లో బంతి ఎక్కువగా స్పిన్న్‌ అయితేనే వికెట్లు లభిస్తాయి. సాంట్నర్ ఎక్కువగా షార్డ్‌ బంతుల్ని సంధిస్తున్నాడు. అది పరుగులు చేయడానికి ఈజీ అవుతుంది. బంతిని పలు రకాలుగా స్పిన్‌ చేయలేనప్పుడు ఏ బౌలర్‌ అయినా టెస్టుల్లో అనవసరం. మాతో జరుగుతున్న మ్యాచ్‌లో సాంట్నర్ అవసరం లేదు" అని మార్క్ వా చెప్పుకొచ్చాడు.

బాక్సింగ్ డే టెస్టులో కివీస్ ఓటమి ఖాయం

బాక్సింగ్ డే టెస్టులో కివీస్ ఓటమి ఖాయం

"ఈ కారణంతో న్యూజిలాండ్ ఈ టెస్టు మ్యాచ్‌ని కోల్పోవడం ఖాయం. ఆస్ట్రేలియాలో మంచి స్పిన్నర్ లేదా కనీసం వికెట్లు తీయగలిగే స్పిన్నర్‌ను ఆయా జట్లు కలిగి ఉండాలి. సిడ్నీలో జరగబోయే టెస్టులో సాంట్నర్‌ను న్యూజిలాండ్ జట్టులో చూడాలనుకోవడం లేదు. అతడి స్థానంలో ఓ లెగ్‌ స్పిన్నర్‌ను తుది జట్టులో తీసుకోవడం మంచిది" అని అన్నాడు.

467 పరుగులు చేసిన ఆలౌటైన ఆస్ట్రేలియా

467 పరుగులు చేసిన ఆలౌటైన ఆస్ట్రేలియా

ఓవర్‌నైట్‌ స్కోరు 257/4తో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 27 పరుగులు జోడించిన తర్వాత స్టీవ్ స్మిత్ వికెట్‌ను కోల్పోయింది. మరోవైపు ట్రావిస్‌ హెడ్‌(114) సెంచరీ సాధించగా, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌(79) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ వాగ్నెర్ నాలుగు వికెట్లు తీయగా... టిమ్ సౌథీ మూడు, గ్రాండ్ హోమ్ రెండు, ట్రెంట్ బౌల్ట్‌కు ఒక వికెట్ లభించింది.

Story first published: Friday, December 27, 2019, 15:10 [IST]
Other articles published on Dec 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X