న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గప్తిల్‌, నీషమ్‌ మెరుపులు.. ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్‌ విజయం.. జోర్డాన్‌ శ్రమ వృథా

Mitchell Santner, James Neesham help NZ level series, Chris Jordans all-round efforts went in vain

వెల్లింగ్టన్‌: వెల్లింగ్టన్‌ వేదికగా వెస్ట్‌పాక్‌ స్టేడియంలో ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. హిట్టర్ కోలిన్ మున్రో (7) త్వరగానే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ మార్టిన్‌ గప్తిల్‌ (41) ధాటిగా ఆడాడు.

వైరల్ వీడియో: ఫన్ టైం.. రోహిత్‌ కుమార్తెతో ధావన్‌!!వైరల్ వీడియో: ఫన్ టైం.. రోహిత్‌ కుమార్తెతో ధావన్‌!!

టిమ్ సీఫెర్ట్ (16), కోలిన్ డి గ్రాండ్‌హోమ్ (28), రాస్ టేలర్ (28), డారిల్ మిచెల్ (5) తక్కువ పరుగులే చేసినా.. ఇన్నింగ్స్ చివరలో జేమ్స్‌ నీషమ్‌ (42) ధాటిగా ఆడడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్‌ మాలన్‌ (39), ఇయాన్ మోర్గాన్‌ (32), క్రిస్‌ జోర్డాన్‌ (36) రాణించినా ఇంగ్లాండ్‌ ఓటమిపాలైంది. ముఖ్యంగా జోర్డాన్‌ (3 వికెట్లు, 36 పరుగులు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసినా ఆ జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ 1-1తో సమం అయింది.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ వర్షర్పారణమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫకర్‌ను తొలి ఓవర్‌లోనే స్టార్క్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో సోహెల్‌ (4) ఔట్‌ అవ్వడంతో పది పరుగులకే పాక్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రిజ్వాన్‌తో కలిసి పాక్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ (59) జట్టును ఆదుకున్నాడు. 12.4 ఓవర్లలో పాక్‌ 88/3 స్కోరుతో ఉన్న సమయంలో వర్షం మ్యాచ్‌ను అడ్డుకుంది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు 15 ఓవర్లకు కుదించారు. బాబర్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో పాక్‌ 5 వికెట్లను కోల్పోయి 15 ఓవర్లలో 107 పరుగులు చేసింది.

డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాకు 119 పరుగుల లక్ష్యంను నిర్దేశించారు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆసీస్‌ ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (37), వార్నర్‌ (2) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. 3.1 ఓవర్లలోనే 41/0 పరుగులు చేశారు. కానీ.. వర్షం మరోసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. వర్షం ఎడతెరపి లేకుండా కురువడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. మంగళవారం రెండో టీ20 జరగనుంది.

Story first published: Sunday, November 3, 2019, 21:35 [IST]
Other articles published on Nov 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X