న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs RCB: అతడి ఔట్ కోసం ఫీల్డ్ అంపైర్‌ని కోహ్లీ బెదిరించాడు.. ఇది చాలా అవమానకరం: మెక్లనగాన్

Mitchell McClenaghan accuses Virat Kohli of pressurising Umpire to give Rishabh Pant Out

అహ్మదాబాద్‌: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం 1 పరుగు తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 172 పరుగుల లక్ష్య ఛేదనలో షిమ్రాన్ హెట్‌మైర్‌ (25 బంతుల్లో 53 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషబ్‌ పంత్‌ (58 నాటౌట్‌; 6 ఫోర్లు) అజేయ అర్ధ శతకాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ విజయానికి చివరి బంతికి 6 పరుగుల అవసరమవగా.. పంత్ బౌండరీ మాత్రమే బాదడంతో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు విజయం సాధించింది. అయితే పంత్ వికెట్ కోసం ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మని బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బెదిరించాడని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ మెక్లనగాన్ సంచలన ఆరోపణలు చేశాడు.

CSK vs SRH:విజయ్ 'శంకరా'.. ఈరోజు కూడా జట్టులో ఉంటావా?! సన్‌రైజర్స్‌కు మరో ఓటమి తప్పదు పో!CSK vs SRH:విజయ్ 'శంకరా'.. ఈరోజు కూడా జట్టులో ఉంటావా?! సన్‌రైజర్స్‌కు మరో ఓటమి తప్పదు పో!

విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ బంతిని అంచనా వేయలేకపోయాడు. బంతి టర్న్ అవుతోందని ఊహించి.. లెగ్ సైడ్ భారీ షాట్ ఆడాడు. బంతి టర్న్ అవ్వకుండా నేరుగా వెళ్లి బ్యాట్ అంచున తాకి ఆపై పంత్ ఫ్యాడ్స్‌ని తాకింది. వెంటనే ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం బెంగళూరు ఆటగాళ్లు అప్పీల్ చేశారు. బెంగళూరు ఔట్ అప్పీల్‌ని తిరస్కరిస్తున్నట్లు కనిపించిన ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మ.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పదేపదే (ఐదుసార్లు) అప్పీల్ చేయడంతో అనూహ్యంగా ఔట్ అంటూ వేలెత్తేశాడు.

ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మ నిర్ణయంతో ఆశ్చర్యపోయిన రిషబ్ పంత్ వెంటనే డీఆర్ఎస్ కోరాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో మరో ఆలోచన లేకుండా పంత్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేశాడు. రిప్లైలో బంతి బ్యాట్ ఎడ్జ్ తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అప్పటి వరకూ పంత్ ఔట్ అనుకుని ధీమాతో కనిపించిన విరాట్ కోహ్లీ.. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ కనిపించాడు. వాస్తవానికి కోహ్లీ ఐదుసార్లు అప్పీల్ చేయడంతోనే అంపైర్ ఔట్ ఇచ్చాడు.

ఈ విషయంపై న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ మెక్లనగాన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'విరాట్ కోహ్లీ ఐదు సార్లు అప్పీల్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అది అంపైర్లపై ఒత్తిడి పెంచడమే. చాలా అవమానకర అప్పీల్' అని మెక్లనగాన్ ట్వీట్ చేశాడు. పంత్ ఔట్ కోసం ఫీల్డ్ అంపైర్‌ని కోహ్లీ బెదిరించాడు అని పరోక్ష్యంగా మెక్లనగాన్ అన్నాడు. అయితే కోహ్లీ మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే.

Story first published: Wednesday, April 28, 2021, 16:07 [IST]
Other articles published on Apr 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X