న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో ఆటగాళ్ల బదిలీకి వేళైంది..?

Mid-season Transfer Window Kicks Off in IPL, Terms & Conditions Apply

హైదరాబాద్: ఐపీఎల్‌ చరిత్రలో ఈసారి కొత్తగా వినిపిస్తున్న మాట 'సీజన్‌ మధ్యలో ఆటగాళ్ల బదిలీ'. టోర్నీ సగం పూర్తి అయిన నేపథ్యంలో ఈ బదిలీలకు అవకాశం ఏర్పడింది. ఇలాంటి బదిలీ ప్రక్రియ ఇంతకు ముందు ఫుట్‌బాల్‌ లీగుల్లో ఉంది. ఐపీఎల్‌లో మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ ఫుట్‌బాల్‌లోనే ఇలాంటి బదిలీలకు అవకాశం ఉండేది. పదేళ్లు పూర్తి చేసుకుని పదకొండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఐపీఎల్‌లో ఈసారి ఈ బదిలీలకు అవకాశమిచ్చారు.

పదకొండో సీజన్‌ ఇప్పటికే సగం ముగిసింది. అన్ని జట్లూ తలో 7 మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ నేపథ్యంలో వేలంలో అధిక ధర పలికి ఏ మాత్రం ప్రభావం చూపని ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఇతర జట్లకు బదిలీ చేసుకొనే అవకాశాలున్నాయి. యాజమాన్యాలకే కాకుండా ఆటగాళ్లకూ ఇది ఒక విధంగా లాభదాకయకమే. ఎక్కువ మంది స్టార్‌ ఆటగాళ్లు ఉండటంతో అందరికీ ఆడేందుకు అవకాశం రాని జట్లలోని ఆటగాళ్లు వేరే జట్టులోకి మారిపోవచ్చు.

బదిలీలు జరిగేది ఎప్పుడంటే:

బదిలీలు జరిగేది ఎప్పుడంటే:

సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఆదివారం (29, ఏప్రిల్‌) సీజన్‌లో 28వ మ్యాచ్ జరిగింది‌. దీంతో సీజన్‌ తొలి అర్ధభాగం ముగిసింది. ఏప్రిల్‌ 29న మొదలైన ఈ అవకాశం ఈనెల 10 వరకూ 12 రోజులపాటు ఉంటుంది. మే 10 లోపు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ఇతర జట్లకు బదిలీ చేసుకోవచ్చు. అంటే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మధ్య జరిగే 42వ మ్యాచ్‌ లోపు అన్నమాట.

ఉపయోగం, ఎలా మారాలి:

ఉపయోగం, ఎలా మారాలి:

ఇప్పటికే ఆయా జట్లలో ఉండీ అవకాశం రాని ఆటగాళ్లకు.. అవకాశం వచ్చినా సత్తా చాటలేకపోయిన వారికి ఈ బదిలీ ఉపయోగపడనుంది. క్యాప్డ్‌, అన్‌క్యాప్డ్ ప్లేయర్ల (దేశవాళీ, విదేశీ)కు బదిలీ అవకాశం ఉంటుంది. 28వ మ్యాచ్‌ ముగిశాక.. రెండు మ్యాచ్‌లకంటే తక్కువ ఆడిన క్యాప్డ్‌ క్రికెటర్లు అర్హులు. అన్ క్యాప్డ్ ఆటగాళ్లయితే అందరికీ బదిలీకి అవకాశం ఉంటుంది.

 ఎలా జరుగుతుంది..

ఎలా జరుగుతుంది..

బదిలీకి ఆసక్తి కనబరిచే రెండు ఫ్రాంచైజీలు చర్చల ద్వారా, బదిలీకి ఇష్టపడే ఆటగాళ్ల అంగీకారంతో ఇది జరుగుతుంది. హేల్స్‌, డుమిని, డుప్లెసిస్‌, సౌథీలాంటి వారంతా బదిలీకి అర్హులవుతారు.

నియమాలు ఏంటి?

నియమాలు ఏంటి?

ఆటగాళ్లను బదిలే చేసేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఫ్రాంచైజీలు ఇష్టానుసారం క్రికెటర్‌ను బదిలే చేసేందుకు వీల్లేదు.

* జాతీయ జట్టుకు ఆడిన, ఆడని క్రికెటర్లు బదిలీకి అర్హులు.

* జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లైతే మ్యాచ్‌-28 లోపు రెండు కన్నా తక్కువ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.

* జాతీయ జట్టులో అరంగేట్రం చేయని ఆటగాళ్లందరూ బదిలీ ప్రక్రియకు అర్హులు.

* బదిలీకి రెండు ఫ్రాంచైజీలు అంగీకరించాలి. అప్పుడే ఈ ప్రక్రియ మొదలవుతుంది.

ఈ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే అలెక్స్‌ హేల్స్‌, జేపీ డుమిని, డుప్లెసిస్‌, టిమ్‌ సౌథీ, ఇష్‌ సోధి వంటి కొందరు ఆటగాళ్లు బదిలే అయ్యే అవకాశాలున్నాయి.

Story first published: Tuesday, May 1, 2018, 11:09 [IST]
Other articles published on May 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X