న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు.. నన్ను నిద్ర లేపు నాన్నా!! మైకెల్ వాన్ షాక్!

Michael Vaughan said My son tells me when Virat kohli comes to bat, just wake me up

సిడ్నీ: ఈ తరం క్రికెటర్లలో విరాట్ కోహ్లీ నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌. క్రీజులోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఇక లక్ష్య ఛేదనలో అయితే మరింత దూకుడుగా ఆడుతాడు. అతని ఆటకు అభిమానులే కాదు క్రికెటర్లు కూడా ఫిదా అవుతారు. కేవలం భారత దేశ అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాన్స్ విరాట్ ఆటను ప్రేమిస్తారు. విరాట్ బ్యాటింగ్ కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కుమారుడికి కూడా విరాట్ ఆటంటే పిచ్చి. అందుకే విరాట్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు నన్ను నిద్ర లేపు నాన్న అని అడుగుతాడట. ఈ విషయాన్ని వాన్ స్వయంగా చెప్పాడు.

నన్ను నిద్ర లేపు నాన్నా:

నన్ను నిద్ర లేపు నాన్నా:

తాజాగా మైకెల్ వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. 'మా అబ్బాయి ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు.. నన్ను నిద్ర లేపు నాన్నా అని అంటుంటాడు. మొదటిసారి అలా చెప్పినపుడు షాక్ అయ్యా. ఆ తర్వాత అలవాటైపోయింది. చిన్నారులపై కోహ్లీ ప్రభావం ఎంతో ఉంది. చాలా మంది అతనికి అభిమానులు ఉన్నారు. అందులో నా కుమారుడు ఒకడు' అని తెలిపాడు. వాన్ ఇంగ్లండ్ తరఫున 82 టెస్టులు, 86 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 18 శతకాలు బాదాడు.

టీవీ చూడటం ఆపేసి:

టీవీ చూడటం ఆపేసి:

'ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ మిడ్ వికెట్ వద్ద క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. నా కుమారుడు వెంటనే టీవీ చూడటం ఆపేసి వేరే పని చేసుకున్నాడు. పిల్లలపై కోహ్లీ ప్రభావం ఎంతుందో చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే.. కోహ్లీ బంతులను స్టాండ్స్‌లోకి పంపుతాడు. అతడో ప్రత్యేకమైన ఆటగాడు. విరాట్ బ్యాటింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సెంచరీ కొడితే.. మరో 3-4సార్లు తేలిగ్గా సెంచరీలు చేస్తాడు' అని మైకెల్ వాన్ అన్నాడు.

భారత్ టెస్టులు గెలుస్తుందనుకోవడం లేదు

భారత్ టెస్టులు గెలుస్తుందనుకోవడం లేదు

'విరాట్ కోహ్లీ లేకుండా భారత్ మూడు టెస్టులు ఆడాల్సి రావడం నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. విరాట్ లేకుండా ఆస్ట్రేలియాపై భారత్ టెస్టులు గెలుస్తుందనుకోవడం లేదు. టెస్టు జట్టులో విరాట్ ఎంతో ముఖ్యమైన ఆటగాడు' అని మైకెల్ వాన్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ముగిసిన త‌ర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగి రానున్న సంగ‌తి తెలిసిందే. కోహ్లీ సతీమణి అనుష్క శ‌ర్మ జనవరిలో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుండ‌టంతో.. బీసీసీఐ భారత సారథికి పితృత్వ సెల‌వులు మంజూరు చేసింది.

'తల తిరిగింది.. తిన్నగా కూర్చోలేకపోయా!! రెండో వన్డే ఆడతాననుకోలేదు.. కానీ సెంచరీ చేశా!'

Story first published: Tuesday, December 1, 2020, 14:14 [IST]
Other articles published on Dec 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X