న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హస్సీకి ఊహించని ప్రశ్న: ధోని-పాంటింగ్‌లలో ఎవరు గొప్ప కెప్టెన్?

Michael Hussey picks the best ODI captain between MS Dhoni and Ricky Ponting

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని, రికీ పాంటింగ్ ఇద్దరికీ కొన్ని విషయాల్లో సారుప్యత ఉంది. మూడు ఫార్మాట్లలో ఇద్దరూ బ్యాట్‌తో అద్భుతమైన విజయాలు సాధించారు. ఐసీసీ నిర్వహించే అనేక టోర్నీల్లో కెప్టెన్లుగా కూడా విజయవంతమయ్యారు. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా రికీ పాంటింగ్ రెండు వరల్డ్‌కప్‌(2003, 2007)లతో పాటు రెండు ఛాంపియన్ ట్రోపీలను అందించాడు.

ఇక, ధోని విషయానికి వస్తే 2011లో వన్డే వరల్డ్‌కప్‌తో పాటు 2007 టీ20 వరల్డ్‌కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించాడు. దీంతో పాటు ధోని నాయకత్వంలోని టీమిండియా 2010, 2016లో ఆసియా కప్‌ను కూడా గెలుచుకుంది. ఐసీసీ నిర్వహించే అన్ని మేజర్ ఛాంపియన్‌షిప్‌లను నెగ్గిన ఏకైక కెప్టెన్‌ కూడా ధోనియే.

World Wrestling Championships: కాంస్యంతో మెరిసిన పూనియా, రవిWorld Wrestling Championships: కాంస్యంతో మెరిసిన పూనియా, రవి

ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే

ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే

ఇద్దరు ఆటగాళ్లు కూడా క్రికెట్‌లో అత్యుత్తమ ప్లేయర్లు. 2012లో రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా... ధోని ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు త్వరలోనే వీడ్కోలు పలకనున్నాడు. వీరిద్దరిలో ఎవరు గొప్ప కెప్టెన్‌ అని సగటు క్రికెట్‌ అభిమానిని అడిగితే సమాధానం చెప్పేందుకు కాసేపు ఆలోచిస్తాడు.

ధోని, పాంటింగ్‌లలో ఎవరు గొప్ప

ధోని, పాంటింగ్‌లలో ఎవరు గొప్ప

తాజాగా, ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మైక్‌ హస్సీ ఇదే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంలో మైక్ హస్సీ మాట్లాడుతూ "ఇది చెప్పడం చాలా కష్టం. రికీ పాంటింగ్‌కే నా ఓటు. వన్డేల్లో ధోనీ సారథ్యంలో నేనెప్పుడూ ఆడలేదు. కాబట్టి పాంటింగ్‌నే ఎంచుకుంటా" అని చెప్పుకొచ్చాడు.

ధోనీ నాయకత్వంలోని

ధోనీ నాయకత్వంలోని

ధోనీ నాయకత్వంలోని టీమిండియా 199 వన్డేల్లో 110 మ్యాచ్‌లు గెలుపొందింది. ధోని విజయాల శాతం 59.52గా నమోదు కాగా... రికీ పాంటింగ్ విజయశాతం 76.14గా నమోదైంది. ఇదిలా ఉంటే 2011, 2012 సీజన్లలో టైటిల్ నెగ్గిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో మైక్ హస్సీ ఆడాడు. ప్రస్తుతం ఆ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

79 టెస్టుల్లో 6235 పరుగులు

79 టెస్టుల్లో 6235 పరుగులు

ఆస్ట్రేలియా తరుపున మైక్ హస్సీ 79 టెస్టుల్లో 6235 పరుగులు చేయగా... 185 వన్డేల్లో 5442, 38 టీ20ల్లో 721 పరుగులు చేశాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మైక్ హస్సీ మొత్తం 21 సెంచరీలు బాదాడు.

Story first published: Saturday, September 21, 2019, 10:43 [IST]
Other articles published on Sep 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X