న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసిస్‌కి నా కుక్క కూడా కోచింగ్ ఇస్తుంది: వారిని ఉతికి ఆరేసిన మైకెల్‌క్లార్క్

By Srinivas

సిడ్నీ: ఇటీవలే రిటైర్ అయిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ మాజీ సహచరుల పైన దుమ్మెత్తి పోశాడు. తన కొత్త పుస్తకం 'యాషెస్‌ డైరీ 2015'లో అతడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మాజీ సహచరులు ఆండ్రూ సైమండ్స్‌, మాథ్యూ హేడెన్‌ల విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.

ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ జాన్‌ బుకానన్‌ను ఉతికి పారేశాడు. దేశానికి ఆడేందుకు మందు కొట్టి వచ్చే సైమండ్స్‌కు ఒకరిని విమర్శించే అర్హత లేదని క్లార్క్‌ చెప్పాడు. సైమండ్స్‌ టీవీలో తన కెప్టెన్సీపై విమర్శలు గుప్పించాడని, కానీ కెప్టెన్సీ పైన ఎవరినీ విమర్శించే అర్హత అతడికి లేదన్నాడు.

దేశానికి ఆడేందుకు కూడా మందు తాగి వచ్చే సైమండ్స్‌ కూడా నాపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నాడు. కెరీర్‌ ఆరంభంలో బ్యాట్స్‌మన్‌కు దగ్గరగా ఫీల్డింగ్‌ చేసేందుకు తాను తిరస్కరించానన్న హేడెన్‌ విమర్శను కూడా క్లార్క్‌ కొట్టిపారేశాడు.

Michael Clarke slams Matthew Hayden, Andrew Symonds, John Buchanan for 'low act' pot shots

హెల్మెట్‌ పెట్టుకుని బ్యాట్స్‌మన్‌కు దగ్గర ఫీల్డింగ్‌ చేయమని తనను ఒత్తిడి చేస్తే ఆట నుంచి వైదొలుగుతానని పాంటింగ్‌తో క్లార్క్‌ అనడం తాను విన్నానని ఇటీవల హేడెన్‌ చెప్పాడు. దీనిపై క్లార్క్‌ స్పందించాడు. తన దేశానికి ఆడడాన్ని నేను గొప్పగా భావిస్తానని, పాంటింగ్‌ హార్బర్‌ వంతెనపై నుంచి దూకమన్నా దూకేవాణ్ణన్నాడు.

క్లార్క్‌ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు సంస్కృతి దెబ్బతిందని జాన్ బుచానన్ వ్యాఖ్యానించడంపై మండిపడ్డాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఆడే ఆటగాళ్లు ధరించే టోపీ విలువేంటో జాన్‌కు తెలియదని, అతడెప్పుడూ దానిని ధరించలేదన్నారు.

అతడు కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు తన పెంపుడు కుక్క జెర్రీ కూడా అలవోకగా కోచింగ్‌ ఇవ్వగలిగేదని నిప్పులు చెరిగాడు. స్టీవ్‌ వా, గిల్‌క్రిస్ట్‌, పాంటింగ్‌ లాంటి ఆటగాళ్లు జట్టు సంస్కృతికి మరింత ప్రత్యేకత తేవడానికి ప్రయత్నించారని క్లార్క్‌ సారథ్యంలో ఆ సంస్కృతికి ముప్పు ఎదురైందని బుచానన్ విమర్శించాడు. దానిపై పైవిధంగా క్లార్క్ కౌంటర్ ఇచ్చాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X