న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ సరైనోడు కాదు.. మైకేల్‌ క్లార్క్ షాకింగ్ కామెంట్స్!!

Michael Clarke says Steve Smith should not be captain, Pat Cummins to become next captain

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఆసీస్ జట్టు కెప్టెన్ స్థానంపై క్లార్క్‌ తన అభిప్రాయంను బాహాటంగా తెలిపాడు. ఆసీస్ కెప్టెన్‌గా మాజీ సారథి స్టీవ్ స్మిత్‌ సరైన వ్యక్తి కాదంటూ తేల్చి చెప్పాడు. స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో ఆసీస్ కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు.

'ధోనీ'నా మజాకా.. ప్రాక్టీస్‌కే స్టేడియం దద్దరిల్లింది (వీడియో)!!'ధోనీ'నా మజాకా.. ప్రాక్టీస్‌కే స్టేడియం దద్దరిల్లింది (వీడియో)!!

కెప్టెన్‌గా కమిన్స్‌ ఉండాలి:

కెప్టెన్‌గా కమిన్స్‌ ఉండాలి:

ఇటీవల ఓ మీడియా సమావేశంలో మైకేల్‌ క్లార్క్‌ పాల్గొనగా.. ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను మళ్లీ నియమించాలంటారా? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. 'ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతమంది కెప్టెన్లు అవసరం లేదు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక కెప్టెన్‌ ఉండడం కన్నా.. మూడు ఫార్మాట్లకూ కలిపి ఒకే కెప్టెన్ ఉండటం మంచిది' అని సమాధానం ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు.

స్మిత్ సరైనోడు కాదు:

స్మిత్ సరైనోడు కాదు:

'కమిన్స్‌ ఆటను బాగా అర్ధం చేసుకుంటాడు. అతను ఓపెనింగ్ బౌలర్. అంతేకాదు బ్యాటింగ్ కూడా చేయగలడు. కమిన్స్‌ మైదానంలో చాలా తెలివిగా ఉంటాడు. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమిస్తే మంచిదని నా అభిప్రాయం. ఆసీస్ జట్టుకు ఉత్తమ కెప్టెన్ అవసరం. స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా ఉత్తమ బ్యాట్స్‌మన్‌.. కానీ కెప్టెన్సీ చేయడానికి సరైన వ్యక్తి అని నేను అనుకోను' అని మైకేల్‌ క్లార్క్‌ అన్నాడు.

కెప్టెన్‌గా పైన్ సూపర్:

కెప్టెన్‌గా పైన్ సూపర్:

'టిమ్ పైన్ ఇప్పటికే కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పైన్ వీడ్కోలు చెప్పేవరకు ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా కొనసాగే హక్కు అతనికి ఉంది. టిమ్ ఇప్పుడు 35 ఏళ్లు ఉన్నాడు. ఈ వేసవి తరువాత అతను వీడ్కోలు గురించి ఆలోచిస్తాడని నేను అనుకుంటున్నా. హోమ్ సిరీస్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా గెలిస్తే టిమ్ వీడ్కోలు పలకడానికి అదే అనువైన సమయం అని నేను అనుకుంటున్నా' అని మైకేల్‌ క్లార్క్‌ చెప్పుకొచ్చాడు.

స్మిత్‌కు మాజీల మద్దతు:

స్మిత్‌కు మాజీల మద్దతు:

బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిషేధం కారణంగా స్మిత్ తన కెప్టెన్సీని కోల్పోయాడు. దీంతో పరిమిత ఓవర్లకు ఆరోన్ ఫించ్, టెస్ట్ ఫార్మాట్‌కు టిమ్ పైన్ కెప్టెన్‌లుగా ఉన్నారు. స్మిత్ పునరాగమనం చేసి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆసీస్ మాజీలు మళ్లీ స్మిత్‌కు పగ్గాలు ఇవ్వాలంటున్నారు. అయితే క్లార్క్‌ మాత్రం వద్దనడం విశేషం.

Story first published: Tuesday, March 3, 2020, 10:35 [IST]
Other articles published on Mar 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X