న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ పురస్కారాన్ని నమ్మలేకున్నా.. జూన్‌లో ఏప్రిల్‌ ఫూల్‌ అనుకున్నా: క్లార్క్‌

Michael Clarke Appointed Officer In Order Of Australia

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశానికి సేవ చేసినందుకు గాను అతను 'ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా' అధికారిగా ఎంపికయ్యాడు. మన భారత్‌లో పద్మ పురస్కారాల్లాగే ఆస్ట్రేలియాలో ఇచ్చే అవార్డు. క్రికెట్‌కు అందించిన విశేష సేవలకుగాను క్లార్క్‌కు ఈ పురస్కారం దక్కింది. ఆసీస్‌లో 'ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా' అనేది ఆ దేశ మూడో అత్యున్నత పురస్కారం.

'ఐపీఎల్‌ 2020 నిర్వహించుకొనేందుకు బీసీసీఐకి సర్వ హక్కులూ ఉన్నాయి''ఐపీఎల్‌ 2020 నిర్వహించుకొనేందుకు బీసీసీఐకి సర్వ హక్కులూ ఉన్నాయి'

దిగ్గజ కెప్టెన్ల సరసన క్లార్క్:

దిగ్గజ కెప్టెన్ల సరసన క్లార్క్:

మైకెల్‌ క్లార్క్ ఘనత సాధించి అలన్‌ బోర్డర్‌, బాబ్‌ సిమ్సన్‌, స్టీవ్‌ వా, మార్క్‌ టేలర్‌, రికీ పాంటింగ్‌ లాంటి దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. క్లార్క్‌ 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌ను విజేతగా నిలిపాడు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి కీర్తి, ప్రతిష్ఠలు తెచ్చిన వ్యక్తులను అక్కడి ప్రభుత్వం 'ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా' ఘనతతో సత్కరిస్తుంది. దీంట్లో నాలుగు స్థాయిలుంటాయి. ఆర్డర్‌ సహచరుడు (ఏసీ), ఆర్డర్‌ అధికారి (ఏఓ), ఆర్డర్‌ సభ్యుడు (ఏఎం), ఆర్డర్‌ పతకం (ఓఏఎం). క్లార్క్‌ ఏఓ అయ్యాడు.

జూన్‌లో ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తున్నారనుకున్నా:

జూన్‌లో ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తున్నారనుకున్నా:

తాజాగా లభించిన 'ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా' హోదాపై మైకెల్‌ క్లార్క్‌ మాట్లాడుతూ... 'నిజాయితీగా చెబుతున్నా.. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని నమ్మలేకున్నా. దీన్నెలా వర్ణించాలో మాటలు రావట్లేదు. జూన్‌లో ఏప్రిల్‌ ఫూల్‌ చేస్తున్నారనుకున్నా. ఈ అవార్డుతో ఆసీస్‌ దిగ్గజాలు, నేనెంతో అభిమానించే హీరోల సరసన నిలవడం చాలా సంతోషంగా ఉంది. అంతే గర్వంగా ఉంది. క్రికెట్‌ వల్లే ఇది సాకారమైంది' అని అన్నాడు.

 115 టెస్టులు.. 8,643 పరుగులు‌:

115 టెస్టులు.. 8,643 పరుగులు‌:

టీ20 ప్రపంచకప్‌పై అనుమానాలున్నప్పటికీ ఈ మెగా టోర్నీతోనే మళ్లీ తమ దేశంలో క్రికెట్‌ మొదలవుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 39 ఏళ్ల క్లార్క్‌ తన కెరీర్‌లో 115 టెస్టులాడి 8,643 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 245 వన్డేల్లో 7,981 బాదాడు. ఇందులో 8 శతకాలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 34 టీ20ల్లో 488 పరుగులు చేయగా.. ఒక హాఫ్ సెంచరీ ఉంది.

 ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు దక్కించుకోవడం కోసం:

ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు దక్కించుకోవడం కోసం:

ఎంతో విలువైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ కాంట్రాక్ట్‌లు దక్కించుకోవడం కోసం ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో మంచిగా ఉండడానికి ప్రయత్నించారని, అతణ్ని స్లెడ్జింగ్‌ చేయలేదని మైకెల్‌ క్లార్క్‌ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 'అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు ఐపీఎల్ టోర్నీలోనూ భారత్ బలమేంటో అందరికీ తెలుసు. ఆసీస్ ఆటగాళ్లే కాదు దాదాపు అన్ని జట్ల ప్లేయర్లు టీమిండియాకు వ్యతిరేకంగా ఉండరు. భారత క్రికెటర్లపై స్లెడ్జింగ్‌కి దిగితే.. తమ ఐపీఎల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్లు భయపడుతున్నారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు' అని క్లార్క్ అన్నాడు.

Story first published: Tuesday, June 9, 2020, 7:25 [IST]
Other articles published on Jun 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X