న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Big Bash League : క్రీజులో భారీ హిట్టర్లున్నా.. ఓటమి మాత్రం తప్పలేదు..!

Melbourne Stars failed to cross the victory line against Brisbane Heat

జట్టు మొత్తం సమిష్టిగా రాణించినా ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. బిగ్ బ్యాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ పరిస్థితి ఇదే. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై టాస్ గెలిచిన బ్రిస్బేన్ హీట్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ జట్టు బ్యాటర్లను కట్టడి చేసేందుకు స్టార్స్ బౌలర్లను చెమటోడ్చారు.

ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (20) కొంత ఫర్వాలేదనిపించినా.. జోష్ బ్రౌన్ (4), మార్నస్ లబుషేన్ (1), రెన్‌షా (7) పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటి సమయంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శామ్ హైన్ (73 నాటౌట్), జిమ్మీ పీర్సన్ (57 నాటౌట్) ఇద్దరూ అదరగొట్టారు. స్టార్స్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన ఈ ఇద్దరూ బ్రిస్బేన్ భారీ స్కోరుకు బాటలు వేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. స్టార్స్ బౌలర్లలో లూక్ వుడ్ రెండు వికెట్లు తీసుకోగా.. నాథన్ కౌల్టర్ నైల్ ఒక వికెట్ తీసుకున్నాడు.

ఛేజింగ్‌లో స్టార్స్‌కు మంచి ఆరంభమే లభించింది. జో క్లార్క్ (31), రెన్ షా (41) ఆ జట్టుకు శుభారంభం అందించారు. అయితే క్లార్క్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం ఆ జట్టుకు పెద్దగా కలిసిరాలేదు. ఆ తర్వాత వచ్చిన కాంప్‌బెల్ కెల్లావే (25) ఫర్వాలేదనిపించాడు. చివర్లో మార్కస్ స్టొయినిస్ (36 నాటౌట్), హిల్టన్ కార్ట్‌రైట్ (33 నాటౌట్) మంచి ఇన్నింగ్సులు ఆడారు. చివరి వరకు క్రీజులో ఉన్న ఈ ఇద్దరు తమ జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయారు.

నిర్ణీత 20 ఓవర్లకు ఈ జట్టు 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బ్రిస్బేన్ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్రిస్బేన్ బౌలర్లలో స్వెప్సన్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. జేమ్స్ బేజ్లీ ఒక వికెట్ తీసుకున్నాడు. బ్రిస్బేన్ మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన శామ్ హైన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Sunday, January 22, 2023, 16:50 [IST]
Other articles published on Jan 22, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X