న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్.. టీ20 ప్రపంచకప్‌ ఇక లేనట్టే?

Melbourne lockdown should see ICC take final call on T20 World Cup says BCCI official

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడటం దాదాపు ఖాయం అయిపొయింది. ఎందుకంటే.. ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద నగరమైన మెల్‌బోర్న్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి మరో ఆరు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించింది ఆసీస్ ప్రభుత్వం. ఇప్పటికే విక్టోరియాలో పరిస్థితులు అదుపు తప్పడంతో.. కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆ దేశంలో షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ ఇక కష్టమేననే అభిప్రాయం అంతటా నెలకొంది.

మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్:

మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్:

మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్ పరిస్థితులు చూసిన తర్వాతైనా టీ20 ప్రపంచకప్‌ వాయిదా విషయంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటన విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు సూచించారు. 'మెల్‌బోర్న్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా ఐసీసీ ఈ విషయాన్ని ముగించాల్సి ఉంది. ఈ మెగా టోర్నీ నిర్వహణలో చాలా సమస్యలుంటాయి. అలాగే అక్కడి ప్రజల ఆరోగ్యం కోసం ఆసీస్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ఈ విషయాలపై అవగాహన కలిగి ఉంది' అని బోర్డుకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్?:

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్?:

మరోవైపు సెప్టెంబరులో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధంగా ఉండాలంటూ తమ ఆటగాళ్లకు సీఏ తెలిపినట్టు రెండు రోజుల క్రితం అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో టీ20 ప్రపంచకప్‌ లేనట్టే అనే వార్తలకు మరింతబలం చేకూరినట్టయింది. 'టీ20 ప్రపంచకప్‌ వాయిదాపై ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం సిద్ధమవ్వాలని ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లకు సమాచారం ఇచ్చారు. అయితే సిరీస్‌ గురించి మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత నేరుగా అక్కడి నుంచే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్‌ కోసం భారత్‌ చేరుకుంటారు. యూఏఈ లేదా ఆసియాలో ఇంకెక్కడైనా ఐపీఎల్‌ జరిగినా ఆసీస్‌ ఆటగాళ్లు ఇంగ్లండ్‌ నుంచే వెళ్లొచ్చని సీఏ భావిస్తోంది' అని ఆసీస్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఐసీసీ జాప్యం:

ఐసీసీ జాప్యం:

షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని నిర్వహించడం కష్టమని ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చి చెప్పేసింది. 16 జట్లను వైరస్ బారిన పడకుండా చూడడం కష్టమని.. ప్రయాణ, హోటల్ గదులకు సంబందించిన సమస్యలు వస్తాయని చెప్పింది. ఇక ఖాళీ మైదానాల్లో టోర్నీ నిర్వహించడం కూడా తమకు నష్టం తెచ్చేదని సీఏ పేర్కొంది. ఐసీసీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. దీంతో బీసీసీఐ ఇరుకున పడింది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఆ విండోలో ఐపీఎల్‌ 2020 సీజన్‌ని నిర్వహించుకోవాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. కానీ ఐసీసీ ధోరణితో బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది.

భారత్‌కే మెదటి ప్రాధాన్యత.. 'విదేశాల్లో ఐపీఎల్' లాస్ట్ ఆప్షన్ మాత్రమే: బీసీసీఐ

Story first published: Wednesday, July 8, 2020, 11:17 [IST]
Other articles published on Jul 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X