న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: 24 గంటల్లో ఐపీఎల్ 2020 షెడ్యూల్!!

Meeting with ECB Chief done, BCCI to announce IPL 2020 schedule in next 24 hours

ముంబై: వచ్చే 24 గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) చీఫ్‌ షేక్‌ నహ్‌యాన్‌ బిన్‌ముబారక్‌తో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సమావేశం ముగిసిందని సమాచారం తెలిసింది. దుబాయ్‌, షార్జా, అబుదాబిల మధ్య రాకపోకలు, నిబంధనల్లో సడలింపుల గురించి షేక్‌ నహ్‌యాన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో ఐపీఎల్ 2020 షెడ్యూల్ ఎప్పుడైనా విడుదల కావొచ్చు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ జరుగుతుందని నెల క్రితమే ప్రకటించిన బీసీసీఐ.. అధికారిక షెడ్యూల్‌ను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. దానికి కారణం.. ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న దుబాయ్, షార్జా, అబుదాబీల్లో వైరస్ రూల్స్‌ కఠినంగా ఉండడమే. ముఖ్యంగా అబుదాబీలో అధికారులు రూల్స్ కఠినంగా అమలుచేస్తున్నారు. ఆ నగరంలోకి ఎవరైనా ఎంట్రీ ఇవ్వాలంటే.. 48 గంటల ముందు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగటివ్ వస్తేనే ఎంట్రీ. ఈ లెక్కన అబుదాబిలో ఆడే ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కి 48 గంటల ముందు క్రికెటర్లతో పాటు సహాయ సిబ్బంది, మ్యాచ్ అధికారులు తప్పనిసరిగా వైరస్ టెస్టు చేసుకోవాల్సి ఉంటుంది.

ఐపీఎల్‌ జట్లు వెంటవెంటనే ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆంక్షలుంటే కష్టమని బీసీసీఐ భావిస్తోంది. ఇక ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లతో పాటు సహాయ సిబ్బంది, మ్యాచ్ అధికారులు.. టోర్నీ ఆరంభానికి ముందు నుంచే బయో సెక్యూర్ బబుల్‌లో ఉండనున్నారు. కాబట్టి వారికి మినహాయింపు ఇవ్వాలని బీసీసీఐ.. ఈసీబీ చీఫ్‌ షేక్‌ నహ్‌యాన్‌ బిన్‌ముబారక్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఈసీబీ చీఫ్‌ షేక్‌ నహ్‌యన్‌ యూఏఈలో సాంస్కృతిక, యువత అభివృద్ధి శాఖకు మంత్రి ప్రభుత్వంతో మాట్లాడి సడలింపులు చేయిస్తానని హామీ ఇచ్చారని తెలిసింది. శనివారం గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశం ఉన్నందున.. వెంటనే కొత్త షెడ్యూల్‌ని ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది.

మరోవైపు ఐపీఎల్‌ 13వ సీజన్‌ కోసం అబుదాబిలో బస చేస్తున్న ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లకు భారీ ఉపశమనం లభించినట్లు సమాచారం తెలుస్తోంది. ముంబై, కోల్‌కతా జట్లకు ఇకపై ఔట్‌ డోర్‌లో సాధన‌ చేసుకునేందుకు అనుమతులు లభించాయట. ఈ రోజు నుండే ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఉంది.

'దినేశ్‌ కార్తిక్‌ ఒక్కసారి క్లిక్‌ అయితే.. మళ్లీ టీమిండియాకు ఎంపికవుతాడు''దినేశ్‌ కార్తిక్‌ ఒక్కసారి క్లిక్‌ అయితే.. మళ్లీ టీమిండియాకు ఎంపికవుతాడు'

Story first published: Friday, August 28, 2020, 22:12 [IST]
Other articles published on Aug 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X