న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి టెస్టులో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ ఎవరో తెలుసా? (వీడియో)

By Nageshwara Rao
McCullum hit Test cricket's fastest ton in his last match

హైదరాబాద్: బ్రెండన్ మెక్‌కల్లమ్ అంతర్జాతీయ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. న్యూజిలాండ్‌కు చెందిన ఈ క్రికెటర్ సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున (ఫిబ్రవరి 20, 2016) అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే అందులో స్పెషల్ ఏముందని అంటారా. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి మరీ రిటైరయ్యాడు. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఈ రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మెక్‌కల్లమ్ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. టీ20ను తలపించేలా తన చివరి టెస్టు మ్యాచ్‌ను ఆడాడు. కేవలం 54 బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

అంతకముందు వెస్టిండిస్ దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్, పాక్ బ్యాట్స్‌మన్ మిస్బా ఉల్ హక్‌లు నెలకొల్పిన రికార్డును అధగమించాడు. వీరిద్దరూ టెస్టు క్రికెట్‌లో 56 బంతుల్లో సెంచరీని నమోదు చేశారు. ఈ టెస్టులో మెక్‌కల్లమ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి వరుసగా 101 మ్యాచ్‌లు ఆడిన కివీస్ క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.

Story first published: Tuesday, February 20, 2018, 18:35 [IST]
Other articles published on Feb 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X