న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో భారత బ్యాట్స్‌మన్: ఆసీస్ గడ్డపై మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత

Mayank Agarwal now the only 2nd Indian make a 50+ on Test debut on Australian soil

హైదరాబాద్: అరంగేట్ర టెస్టులోనే భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం మెల్ బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించి సత్తా చాటాడు.

అరంగేట్ర టెస్టులోనే అరుదైన ఘనత

తద్వారా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆరంగేట్ర టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ చరిత్ర సృష్టించాడు. 1947 డిసెంబర్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసిన దత్తు ఫాడ్కర్(51).. ఆసీస్ గడ్డపై ఆరంగేట్ర టెస్టులో అర్ధ శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

71 సంవత్సరాల తర్వాత ఆసీస్ గడ్డపై

71 సంవత్సరాల తర్వాత ఆసీస్ గడ్డపై

మళ్లీ 71 సంవత్సరాల తరవాత మయాంక్ రూపంలో మరో భారత బ్యాట్స్‌మన్ ఈ ఘనత సాధించాడు. కాగా, మయాంక్ అగర్వాల్ (76; 161 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్)రెండో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. పాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్‌ను అంచనా వేయడంలో తికమక పడిన మయాంక్ అగర్వాల్ దానిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి చేతి గ్లౌజులను రాసుకుంటూ కీపర్ టిమ్ పైన్‌ చేతిలో పడింది.

 1934లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో

1934లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో

అరంగేట్రం చేసిన తొలి టెస్టులో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూడా కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్ నిలిచాడు. ఈ ఓపెనర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు.అంతకుముందు 1934లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మన్‌ హుస్సేన్‌ తొలి టెస్టులోనే 59 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 1948లో విండీస్‌తో జరిగిన టెస్టులో అప్పటి ఓపెనర్‌ ఇబ్రహీమ్‌ 85 పరుగులు చేశాడు.

బాక్సింగ్ డే టెస్టు, డే1: మయాంక్, పుజారాలు హాఫ్ సెంచరీ... భారత్ 215/2

అరుణ్‌ లాల్‌ 63 పరుగులతో హాఫ్ సెంచరీ

1971లో విండీస్‌తో జరిగిన టెస్టులో గావస్కర్‌ 65 పరుగులు చేశారు. 1982లో శ్రీలంకతో జరిగిన టెస్టులో ఓపెనర్‌ అరుణ్‌ లాల్‌ 63 పరుగులు సాధించారు. 2013లో ఆసీస్‌తో జరిగిన టెస్టులో శిఖర్‌ ధావన్ అత్యధికంగా 187 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇవే రికార్డు పరుగులు. ఈ ఏడాది విండీస్‌తో జరిగిన టెస్టులో యువ బ్యాట్స్‌మెన్‌ పృథ్వీషా 134 పరుగులు సాధించాడు.

1
43625
Story first published: Wednesday, December 26, 2018, 14:07 [IST]
Other articles published on Dec 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X