న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాక్సింగ్ డే టెస్టు, డే1: మయాంక్, పుజారాలు హాఫ్ సెంచరీ... భారత్ 215/2

India vs Australia 2018,3rd Test Day 1 Highlights,India 215/2 At Stumps
India vs Australia,3rd Test Day 1: Cheteshwar Pujara, Virat Kohli Take India To 215/2 At Stumps On Day 1

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76), ఛటేశ్వర్ పుజారా (68) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 215/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా(68), విరాట్ కోహ్లీ (47) పరుగులతో క్రీజులో ఉన్నారు.

బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఓపెనర్లుగా వచ్చారు. ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు.

మయాంక్‌కు ముందు ఆసీస్ గడ్డపై ఆమీర్

మయాంక్‌కు ముందు ఆసీస్ గడ్డపై ఆమీర్

మయాంక్‌కు ముందు డిసెంబర్‌, 1947న సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ తరుపున ఆమిర్ ఎలాహి ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన హనుమ విహారి విఫలమైన మయాంక్ అగర్వాల్ మాత్రం చక్కటి శుభారంభాన్ని ఇచ్చాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. అనంతరం ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో హనుమ విహారి(8) స్లిప్‌లో ఆరోన్ ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 79 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఫోర్ బాది 95 బంతుల్లో మయాంక్ హాఫ్ సెంచరీ

ఫోర్ బాది 95 బంతుల్లో మయాంక్ హాఫ్ సెంచరీ

స్పిన్నర్ లైయన్ వేసిన 36వ ఓవర్ ఆఖరి బంతిని ఫోర్ బాది 95 బంతుల్లో మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై ఆరంగేట్ర టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. 1947 డిసెంబర్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసిన దత్తు ఫాడ్కర్(51).. ఆసీస్ గడ్డపై ఆరంగేట్ర టెస్టులో హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. మళ్లీ 71 సంవత్సరాల తరవాత మయాంక్ రూపంలో మరో భారత బ్యాట్స్‌మన్ ఈ ఘనత సాధించాడు.

కమ్మిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరిన మయాంక్

హాఫ్ సెంచరీ అనంతరం నిలకడగా ఆడుతున్న మయాంక్‌ అగర్వాల్‌‌ను సైతం కమ్మిన్స్ బోల్తా కొట్టించాడు. జట్టు స్కోరు 123 పరుగుల వద్ద కమిన్స్ వేసిన షార్ట్‌పిచ్ బంతికి మయాంక్ అగర్వాల్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీ విరామ సమయానికి భారత్ 54.5 ఓవర్లలో 2 వికెట్లకు 123 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి నిలకడగా ఆడిన పుజారా 152 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు కెరీర్‌లో పుజారాకిది 21వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆరంభంలో వేగంగా ఆడిన కోహ్లీ తర్వాత కొంచెం నెమ్మదిగా ఆడాడు.

తొలిరోజు చివరి సెషన్‌లో

తొలిరోజు చివరి సెషన్‌లో

తొలిరోజు చివరి సెషన్‌లో 82 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా రెండో కొత్త బంతిని తీసుకున్న ఆసీస్ పేసర్లు వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి గంటకు 150 కిమీ వేగంతో బంతులేశారు. 83వ ఓవర్లో 47 పరుగుల వద్దనున్న కోహ్లీ.. 89 ఓవర్లు ముగిసేవరకు కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోవడం గమనార్హం. ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు.

భారత్ ఆడిన తీరు అద్భుతం

భారత్ ఆడిన తీరు అద్భుతం

మయాంక్‌తో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన పుజారా.. కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మెల్‌బోర్న్ పిచ్‌పై బలమైన ఆసీస్ సీమర్లను ఎదర్కొంటూ వికెట్లను కాపాడుకుంటూ భారత్ ఆడిన తీరు అద్భుతం. అయితే, రెండో రోజు ఉదయం వికెట్లు పారేసుకోకుండా ఇలానే ఆడితే భారత్ భారీ స్కోరు దిశగా వెల్లడం ఖాయం.

1
43625
Story first published: Wednesday, December 26, 2018, 13:27 [IST]
Other articles published on Dec 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X