న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బీసీసీఐ బోర్డు స్వార్థంతో కూడినది'

Mark Waugh Hits Out at Selfish India for Not Playing Day-Night Test

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో డై అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడాలని ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐని కోరింది. దీనిపై విముఖత వ్యక్తం చేసిన టీమిండియా సున్నితంగా తిరస్కరించింది. అయితే దీనిపై పలువురు ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేయగా ఇప్పుడు అదే కోవలో చేరాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా.

టెస్ట్‌ క్రికెట్‌కు పునర్జీవం పోయాలని తాము భావిస్తే బీసీసీఐ స్వార్థపూరితంగా వ్యవహరించందన్నాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, భారత్‌లో టెస్టు క్రికెట్‌కు ఆదరణ లభిస్తోందని, ఈ దేశాలతో టెస్ట్‌ క్రికెట్‌కు పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్నామని వా ఓ రేడియో చానెల్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భారత జట్టులో సమర్థవంతమైన బ్యాట్స్‌మెన్‌, స్పిన్నర్లు, పేసర్లతో పటిష్టంగా ఉండగా అసలు బీసీసీఐ డే/నైట్‌ టెస్టుకు ఎందుకు విముఖత వ్యక్తం చేసిందో అర్థం కావడలేదన్నాడు.

టీమిండియాకు డే/నైట్‌ టెస్టులు సరిగా సరిపోతాయన్నాడు. డే/నైట్‌ టెస్టులు చూడటం తాను ఇష్టపడతానని తెలిపాడు. కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ చాపెల్‌ సైతం ఇదే విధంగా బీసీసీఐని తప్పుబట్టాడు. మరోవైపు మార్క్‌ వా జాతీయ సెలక్టర్ బాధ్యతల నుంచి వైదొలగాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. తర్వాత వ్యాఖ్యాతగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్‌ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

మార్క్‌ పదవీ కాలం వచ్చే ఆగస్టు 31తో ముగియనుంది. ఇక భారత్‌ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల కోసం నవంబర్‌ 21 నుంచి జనవరి 18 వరకు విదేశీ పర్యటన చేయనుంది. పదవీ కాలం పూర్తి అయినా అప్పటి వరకూ అదే పదవిలో కొనసాగనున్నాడు. డే/నైట్‌ టెస్టు ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18 నెలల సాధన అవసరమని టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి సూచించడంతో బీసీసీఐ క్రికెట్‌ ఆస్ట్రేలియా డే/నైట్‌ ప్రతిపాదనను తిరస్కరించింది.

Story first published: Wednesday, May 16, 2018, 19:08 [IST]
Other articles published on May 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X