న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికిండు : అక్తర్

Manish Pandey replacement for MS Dhoni? Shoaib Akhtars prediction

ఇస్లామాబాద్ : గత కొన్ని నెలలుగా జట్టుకు, ఆటకు దూరమైన టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్‌కప్స్ విన్నింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పునరాగమనం ఎప్పుడెప్పుడా? అని భారత క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వరల్డ్‌కప్ సెమీస్ ఓటమి అనంతరం ఈ లెజండరీ క్రికెటర్ బ్యాట్‌పట్టలేదు. తన భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వలేదు. తొలుత మిలటరీ అంటూ రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నా.. అనంతరం జనవరి వరకు క్రికెట్ గురించి ప్రశ్నించవద్దన్నాడు. తీరా ఇప్పుడు కూడా నోరు విప్పడం లేదు.

నేను ఆడిన టీమిండియా కాదు.. ఆసిస్‌ను చిత్తు చేసిన భారత్‌పై పాక్ క్రికెటర్ ప్రశంసలు..నేను ఆడిన టీమిండియా కాదు.. ఆసిస్‌ను చిత్తు చేసిన భారత్‌పై పాక్ క్రికెటర్ ప్రశంసలు..

బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోయినా.. అతని అభిమానులంతా గగ్గోలు పెట్టినా ఈ జార్ఖండ్ డైనమైట్ మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ధోని భవిష్యత్తుపై ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. కొందరు లెజండ్ క్రికెటర్ ఈజ్ బ్యాక్ అంటే మరికొందరు ధోని ఖేల్ ఖతమైందంటున్నారు.

ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ధోని పునరాగమనం లేదనే పరోక్షంగా చెబుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ విజయానంతరం కోహ్లీసేనపై ప్రశంసలు కురిపించిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. భారత్‌కు ధోని స్థానాన్ని భర్తీచేసే మొనగాడు దొరికాడని తెలిపాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. 'హిందుస్తాన్ కో అఖిల్ ధోని కా రిప్లేస్‌మెంట్ మిల్ గయా(మొత్తానికి ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఇండియాకు దొరికాడు). నా దృష్టిలో మనీష్‌ పాండే ఐదో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. ధోని స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం మనీష్‌కు ఉంది. శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా తన బ్యాటింగ్‌ సామర్థ్యంతో జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ఇద్దరితో ఇండియా బ్యాటింగ్ మరింత బలంగా మారింది'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

స్మిత్‌కు అంత సీన్ లేదు.. కోహ్లీనే ఆల్‌టైమ్ బెస్ట్ : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్స్మిత్‌కు అంత సీన్ లేదు.. కోహ్లీనే ఆల్‌టైమ్ బెస్ట్ : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన సిరీస్ సాదాసీదా పోరు కాదని, ఇరుజట్ల మధ్య ఆత్మగౌరవ యుద్దమని అభివర్ణించాడు. కోహ్లీ నేతృత్వంలోని ప్రస్తుత జట్టు... తాను ఆడిన రోజుల్లోని టీమిండియాలా కాదని కితాబిచ్చాడు.

'విరాట్ కోహ్లీ ఓ అసాధారణ కెప్టెన్. ధృడసంకల్పం కలిగిన వ్యక్తి. ఓటమి నుంచి ఎలా పుంజుకోవాలో కోహ్లికి అతని ప్లేయర్లకు బాగా తెలుసు. ఎలాంటి అవకాశాన్ని వదులుకోడు. ఈ సిరీస్ ఇరు జట్ల మధ్య జరిగిన ఆత్మగౌరవ పోరు. ప్రస్తుత టీమ్ నేనాడినప్పటి ఇండియా కాదు. పూర్తిగా విభిన్నం. తొలి మ్యాచ్ ఓడిన తర్వాత సిరీస్ గెలవడం చాలా కష్టం. కానీ కోహ్లీసే అదరగొట్టింది.' అని షోయబ్ తెలిపాడు.

Story first published: Tuesday, January 21, 2020, 15:04 [IST]
Other articles published on Jan 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X