న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో మనీష్‌ పాండే జైత్రయాత్ర.. వరుసగా ఆరుసార్లు నాటౌట్‌!!

Manish Pandey Extends His Unbeaten Run In T20 Cricket
Manish Pandey extends his unbeaten run in T20 cricket with 50 not out vs New Zealand

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్ల స్కోర్లు సమమైన మ్యాచ్‌లో విజేతను నిర్ణయించే సూపర్‌ ఓవర్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తాజా విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో ముందంజ వేసింది. మనీశ్‌ పాండే (36 బంతుల్లో 50 నాటౌట్‌, 3 ఫోర్లు), శార్దుల్‌ ఠాకూర్‌ (2/33) టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.

సాక్షి vs ధోనీ: ఎంతమంది ఉన్నా.. నేను ఎప్పటికీ నీదాన్నే!!సాక్షి vs ధోనీ: ఎంతమంది ఉన్నా.. నేను ఎప్పటికీ నీదాన్నే!!

పాండే హాఫ్‌ సెంచరీ:

పాండే హాఫ్‌ సెంచరీ:

గతకొంత కాలంగా భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. జట్టు కష్టాలో ఉన్న సమయంలో అద్భుత బ్యాటింగ్‌తో ఆడుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి అజేయ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో కేవలం మూడు ఫోర్లు బాదినా.. స్టైక్‌ను రొటేట్‌ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పాండే ఇన్నింగ్స్‌తోనే భారత్‌ 166 పరుగులను కివీస్ ముందు ఉంచింది.

డబుల్‌ హ్యాట్రిక్‌:

డబుల్‌ హ్యాట్రిక్‌:

30 ఏళ్ల మనీష్‌ పాండే టీ20ల్లో తన నాటౌట్‌ ప్రస్తానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటివరకూ ఔట్‌ కానీ పాండే.. అంతర్జాతీయ టీ20ల్లో వరుసుగా ఆరుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నాటౌట్‌ల విషయంలో 'డబుల్‌ హ్యాట్రిక్‌' కొట్టాడు. పాండే గత ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌ల స్కోర్లు (50 నాటౌట్‌, 14 నాటౌట్‌, 14 నాటౌట్‌, 31 నాటౌట్‌, 22 నాటౌట్‌, 2 నాటౌట్‌) ఇలా ఉన్నాయి. 50 *, 14 *, 14 *, 31 *, 60 * 3 * ఇవి దేశవాళీ టీ20ల్లో పాండే నాటౌట్‌ల గణాంకాలు.

మూడో స్థానంలో మనీష్‌ పాండే

మూడో స్థానంలో మనీష్‌ పాండే

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 46.40 యావరేజ్‌తో మనీష్‌ పాండే మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ, బాబర్‌ అజామ్‌ల తర్వాత అత్యుత్తమ యావరేజ్‌ పాండేదే కావడం విశేషం. 2019 ఆగస్టు 3వ తేదీ నుంచి ఇప్పటివరకూ భారత్‌కు పాండే 9 సార్లు ప్రాతినిధ్యం వహించగా.. అందులో ఆరుసార్లు అజేయంగా ఉండటం మరొక విశేషం. ఇదే సమయంలో పాండే ఆడిన 9 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందడం మరో విశేషం.

 భారత్‌కు ఇదే తొలిసారి

భారత్‌కు ఇదే తొలిసారి

వన్డే క్రికెట్‌లో మనీష్ పాండే 2016లో ఆస్ట్రేలియాపై 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. పాండే 2018లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. గత సంవత్సరం ఒక్క వన్డే ఆడటానికి అవకాశం రాలేదు. నాలుగో టీ20లో మనీశ్‌ పాండే చేసిన అర్ధ సెంచరీ అంతర్జాతీయ టీ20ల్లో మూడోది. న్యూజిలాండ్‌పై వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం భారత్‌కు ఇదే తొలిసారి. ఇక వెస్ట్‌ప్యాక్‌ స్టేడియంలో టీ20 మ్యాచ్‌ గెలువడం టీమిండియాకు ఇదే మొదటిది.

Story first published: Saturday, February 1, 2020, 13:55 [IST]
Other articles published on Feb 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X