న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అతనిని కాపాడుకోవడమే మా బాధ్యత అయిపోయింది'

Managing Mustafizur my worry: Walsh

హైదరాబాద్: తరచుగా గాయాల బారిన పడుతోన్న ముస్తఫిజుర్ రెహమాన్‌ తన ఫిట్‌నెస్ తప్పక కాపాడుకోవాల్సి ఉందని ఆ జట్టు కోచ్ కోట్నీ వాష్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే డెహ్రాడూన్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ బంగ్లాదేశ్ కోచ్ మీడియాతో ఇలా ముచ్చటించాడు. ఇటీవల కాలంలో తరుచు గాయాల బారిన పడుతున్న ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపాడు. యువకుడైన ముస్తాఫిజుర్‌ గాయాల బారిన పడటం తనను తీవ్రంగా కలచివేస్తోందన్నాడు.

'ముస్తాఫిజర్‌ గురించే నా బెంగ. అతను గాయాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇప్పటికీ ఐపీఎల్ నుంచి ఇలా 2 సార్లు గాయాలతో జాతీయ జట్టు మ్యాచ్‌లకు వచ్చాడు. ఓ ఫాస్ట్ బౌలర్ ఆడుతుంటే మ్యాచ్ చూడాలని అందరికీ అనిపిస్తుంటుంది. అలాంటిది అతను గాయాల కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకుంటే ఎంతో నష్టముంటుంది. ముస్తాఫిజుర్‌ను తిరిగి శక్తిమంతంగా తీర్చడంపై దృష్టి సారించా.'

'అతనొక యువ క్రికెటర్‌. అతనికి చాలా భవిష్యత్తు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ముస్తాఫిజుర్‌ గాయాల పాలు కాకుండా చూసుకోవాలి. అతని బౌలింగ్‌ ప్రమాణాలు అసాధారణం. ఈ ఆధునిక క్రికెట్‌లో ఒక ఫాస్ట్‌ బౌలర్‌ వివిధ రకాలైన ఫార్మాట్లలో ఆడటం కారణంగానే ఎక్కువగా గాయాల బారిన పడతాడనే విషయాన్ని అర్థం చేసుకోగలను. ముస్తాఫిజుర్‌ విషయంలో కూడా ఇదే జరిగిందని నేను అనుకుంటున్నా. ఐపీఎల్ నుంచి వచ్చాక అతనికి గాయమైందనే విషయం చెప్తే సంగతి వేరేలా ఉండేది.'

'అలా చెప్పకుండా అతని ఆటతీరులో మార్పు వచ్చేసరికి గమనించాం. ప్రతి ఆటగాడు తనంతట తానే బాధ్యత తీసుకుని రెండు ఫార్మాట్‌లకు అనుకూలంగా ఉండేలా తనని తాను మలచుకోవాలని' అని వాల్ష్‌ పేర్కొన్నాడు. వాల్ట్ ఆటగాడిగా కెరీర్ కొనసాగించినప్పుడు టెస్టు మ్యాచ్‌లలో ఆడి 519 వికెట్లు తీశాడు.

Story first published: Monday, June 4, 2018, 14:39 [IST]
Other articles published on Jun 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X