న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరుణానిధి మృతి: సంతాపం తెలిపిన రైనా, చెన్నై సూపర్ కింగ్స్

By Nageshwara Rao
M Karunanidhi demise: How Chennai Super Kings, Suresh Raina paid condolences

హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్, టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా తమ సంతాపాన్ని తెలియజేశారు. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజధాని చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం గం.6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

కరుణానిధి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూలై 26వ తేదీన ఆయన్ని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కావేరి ఆస్పత్రిలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. కరుణ మృతి నేపథ్యంలో బుధ, శుక్రవారాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు.

కరుణానిధి మృతిపట్ల ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్, టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా సంతాపం ప్రకటించారు. "ద్రవిడ ఉద్యమనేత కరుణానిధి అస్తమయం. తమిళంపై ఆయనకు ఉన్న పట్టు అపారమైనదని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు" అని చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్‌లో పేర్కొంది.

మరోవైపు టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా సోషల్ మీడియా వేదికగా తన సంతాపాన్ని తెలియజేశాడు. "కలైంజర్ కరుణానిధి మృతిపట్ల సంతాపం తెలుపుతున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా తన ట్విటర్‌లో పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే కరుణానిధి పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం రాజాజీ హాలులో ఉంచారు. సాయంత్రం ఏడు గంటల వరకు సందర్శించవచ్చు. 1924, జూన్ 3న తంజావూరులోని తిరుక్కువలైలో జన్మించిన కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. ఆయన వయస్సు 94 ఏళ్లు. ఆయన పూర్వీకులు తెలుగువాళ్లు.

1957లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎంపికైన కరుణానిధి.. ఆ తర్వాత 2016 వరకు ఓటమి ఎరుగకుండా జైత్రయాత్రని కొనసాగించారు. 1949లో డీఎంకే పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో కరుణానిధి ఒకరు. అన్నాదురై మరణంతో 1969లో ఆయన తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.

1957 నుంచి 13సార్లు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికవుతూ వచ్చిన కరుణానిధి దాదాపు 50 ఏళ్లు డీఎంకే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించి చరిత్ర సృష్టించారు. ఆయనకు ముగ్గురు భార్యలు, నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆయన చిన్న కుమారుడు స్టాలిన్ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

Story first published: Wednesday, August 8, 2018, 15:23 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X