న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విధేయత అనేది చాలా ముఖ్యం: వరల్డ్‌కప్ జట్టులో ధోనిపై కోహ్లీ

ICC Cricket World Cup 2019 : MS Dhoni Best At Reading Match Situation Says Virat Kohli || Oneindia
Loyalty matters most: Virat Kohli recalls early support from MS Dhoni

హైదరాబాద్: క్రికెట్‌లో విధేయత అనేది చాలా ముఖ్యమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న విరాట్‌కోహ్లీ వరల్డ్ కప్ జట్టుపై ఇండియా టుడేకి ప్రత్యేకంగా ఇంటర్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్యూలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై విరాట్ కోహ్లీ తన విధేయతను చాటుకున్నాడు. కోహ్లీ మాట్లాడుతూ "విధేయత అనేది చాలా ముఖ్యం. నేను జట్టులోకి వచ్చిన కొత్తలో పెద్దగా ఆకట్టుకోలేదు. నన్ను కాదని వేరొకరిని ప్రయత్నించే అవకాశం ఉన్నా, మహీభాయ్ ఆ పని చేయలేదు" అని అన్నాడు.

ధోని నా వెన్నంటే నిలిచాడు

ధోని నా వెన్నంటే నిలిచాడు

"ఆ తర్వాత బ్యాటింగ్‌లో రాణించా. కానీ, ప్రారంభంలో ఇబ్బంది పడుతున్న సమయంలో నా వెన్నంటే నిలిచాడు. అది నాకు చాలా ఉపయోగపడింది. మూడో నంబర్‌లో అవకాశమిచ్చింది కూడా ధోనినే. ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్లు ధోనీకి ఆటపై గొప్ప అవగాహన ఉంది. తొలి బంతి నుంచి 50 ఓవర్లు పూర్తయ్యేవరకు ప్రతీ బంతిని దగ్గరగా గమనిస్తాడు" అని కోహ్లీ తెలిపాడు.

ధోని జట్టులో ఉండడం నా అదృష్టం

ధోని జట్టులో ఉండడం నా అదృష్టం

"ధోని జట్టులో ఉండడం నాకు చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పను. స్టంప్స్‌ వెనుక అతడి లాంటి తెలివైన వ్యక్తి ఉండడం నా అదృష్టమని చెబుతా. టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో వ్యూహరచనలో మహీ భాయ్‌, రోహిత్‌ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటా. మ్యాచ్‌కు సంబంధించిన చాలా విషయాల్లో ధోనీ నుంచి విలువైన సలహాలు స్వీకరిస్తా. అందుకే మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది" అని కోహ్లీ అన్నాడు.

బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుంటా

బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుంటా

"చివరి ఓవర్లలో ఎక్కువగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుంటా. అలా ఉండడం నా స్వభావం. 30-35 ఓవర్లు ముగిసేసరికి నేను వెనక్కి వెళ్లిపోతానని మహీకి తెలుసు. అది సహజంగా జరిగేదే. ఆ సమయంలో ధోనీయే అన్నీ చూసుకుంటాడు. అందుకే మా మధ్య పరస్పర గౌరవం, నమ్మకం ఉంది" అని కోహ్లీ పేర్కొన్నాడు.

డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది

డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది

ప్రస్తుతం భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుందని కోహ్లీ అన్నాడు. 2011 వరల్డ్‌కప్‌లో తాను పెద్దగా జోక్యం చేసుకోలేదని... ఈసారి అలా ఉండదని, ప్రతి అంశంలోనూ తన ఆలోచన భిన్నంగా ఉంటుందని కోహ్లీ చెప్పాడు. వరల్డ్‌కప్ జట్టుకు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేయడంపై కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు.

Story first published: Friday, April 19, 2019, 17:21 [IST]
Other articles published on Apr 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X