న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓటు హక్కును వినియోగించుకున్న టీమిండియా క్రికెటర్‌

Lok Sabha Elections 2019: Cricketer Cheteshwar Pujara cast his vote in Rajkot

దేశ వ్యాప్తంగా మూడో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. గుజరాత్‌లో కూడా పోలింగ్‌ కొనసాగుతుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు నేతలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్‌, టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర్‌ పూజారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పరిధిలో ఉన్న మదాపర్‌లో పుజారా ఓటు వేశారు. అనంతరం ఓటు హక్కును వినియోగించుకున్నాను అని ట్విట్టర్ వేదికగా తెలిపారు. పుజారాతో పాటు ఆయన సతీమణి, తండ్రి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.


'కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నా. ప్రజాస్వామ్య దేశంలో ఓ బాధ్యత గల పౌరుడిగా మీరు ఓటు హక్కును వినియోగించుకోండి. మీ ఓటుపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది' అని పూజారా తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.
Story first published: Tuesday, April 23, 2019, 13:40 [IST]
Other articles published on Apr 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X