న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పరువు కోసం పోరాడి.. 63 పరుగుల ఆధిక్యంతో గెలిచిన భారత్ (వీడియో)

LIVE Cricket Score, India vs South Africa, 3rd Test, Day 4 at Johannesburg: Proteast off to a confident start

హైదరాబాద్: బ్యాట్స్‌మెన్‌ల‌కు వ‌ణుకు పుట్టించిన వాండ‌ర‌ర్స్ స్టేడియంలో కోహ్లీ సేన విజేత‌గా నిలిచింది. రెండు టెస్టులు ఓడిపోయారంటూ ఎవ‌రెన్ని ర‌కాలుగా విమ‌ర్శించినా వాటికి త‌గిన బ‌దులు చెప్పింది. రెండు టెస్టుల్లో గెల‌వ‌క‌పోవ‌డంతో మూడో టెస్టును గెలిచి ప‌రువు నిలుపుకోవాల‌ని కోసం తీవ్రంగా క‌ష్టించింది. చివ‌ర‌కు 63 ప‌రుగుల తేడాతో భార‌త బౌల‌ర్లు త‌మ ప్ర‌తాపం చూపించి గెలిచి చూపించారు.

రెండో టెస్టు పరాజయం అనంతరం క్రీడా విశ్లేషకుల దగ్గర్నుంచి క్రికెట్ కాస్తో కూస్తో తెలిసిన ప్రతి ఒక్కరూ రహానెను తీసుకోవాలని సూచించడంతో కోహ్లీ జట్టులో మార్పులు చేయక తప్పలేదు. రోహిత్ శర్మను తప్పించి రహానెను జట్టులోకి తీసుకున్నాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 247 స్కోరుతో సఫారీ జట్టుకు మంచి టార్గెట్ నే ఇచ్చింది. 240 పరుగులు లక్ష్యంగా బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా జట్టు 177పరుగులను చేసింది.

లంచ్ బ్రేక్: సఫారీ స్కోరు 69/1

చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ధాటిగా ఆడుతోంది. నాలుగో రోజు, శనివారం భోజన విరామానికి 28 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 69 పరుగులు చేసింది. సఫారీ జట్టకు విజయం మరో 172 పరుగుల దూరంలోనే ఉంది. ఆ జట్టుకు ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ గెలవడం కష్టం కాకపోవచ్చు.

ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (29; 100 బంతుల్లో 3×4), హషీమ్‌ ఆమ్లా (27; 61 బంతుల్లో 4×4) వేగంగా ఆడుతున్నారు. ముఖ్యంగా ఆమ్లా భారత బౌలర్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌ మార్చుకునేలా వికెట్లను పూర్తిగా కవర్‌ చేస్తూ ఆఫ్‌సైడ్‌ వచ్చి బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

పిచ్‌ నుంచి ఆశించిన సహకారం అందకపోవడంతో టీమిండియా బౌలర్లు అంతగా ప్రభావం చూపించలేకపోతున్నారు. భువి, బుమ్రా సైతం వికెట్లు తీయలేకపోతున్నారు. నేరుగా స్టంప్స్‌పైకి దాడి చేయలేకపోతున్నారు. శుక్రవారం వరకు బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ స్వభావం వాతావరణ మార్పుల కారణంగా మారింది. బంతి బౌన్స్ కాకుండా ఉండటం గమనార్హం.

గెలవాలనే కసితో బంతులను సంధిస్తున్న భారత ఆటగాళ్లు:

భారత్‌-దక్షిణాఫ్రికా చివరి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభం అయ్యింది. శుక్రవారం సాయంత్రం వాండరర్స్‌లో వర్షం రావడంతో మైదానం తడిగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం గంట ఆలస్యంగా ఆట ప్రారంభించారు.

రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 17/1తో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 14 ఓవర్లు ముగిసే సరికి 41/1తో ఉంది. డీన్‌ ఎల్గర్‌ (17; 55 బంతుల్లో 2×4), హషీమ్‌ ఆమ్లా (11; 22 బంతుల్లో 2×4)బ్యాటింగ్‌ చేస్తున్నారు. భారత్‌ గెలవాలంటే దక్షిణాఫ్రికాను 240 పరుగులకు లోపే ఆలౌట్‌ చేయాలి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 187
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 194
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 247
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (సి) పార్థివ్‌ (బి) షమి 4; ఎల్గర్‌ నాటౌట్‌ 86; ఆమ్లా (సి) పాండ్య (బి) ఇషాంత్‌ 52; డివిలియర్స్‌ (సి) రహానె (బి) బుమ్రా 6; డుప్లెసిస్‌ (బి) ఇషాంత్‌ 2; డికాక్‌ ఎల్బీ (బి) బుమ్రా 0; ఫిలాండర్‌ (బి) షమి 10; ఫెలుక్వాయో (బి) షమి 0; రబాడ (సి) పుజారా (బి) భువనేశ్వర్‌ 0; మోర్కెల్‌ (బి) షమి 0; ఎంగిడి (సి) కార్తీక్‌ (బి) షమి 4; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (77.3 ఓవర్లలో ఆలౌట్‌) 177
వికెట్ల పతనం: 1-5, 2-124, 3-131, 4-144, 5-145, 6-157, 7-157, 8-160, 9-161
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 18-4-39-1; షమి 12.3-2-28-5; బుమ్రా 21-3-57-2; ఇషాంత్‌ శర్మ 16-3-31-2; హర్దిక్‌ పాండ్య 6-1-15-0

Story first published: Sunday, January 28, 2018, 12:39 [IST]
Other articles published on Jan 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X