న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేశ రక్షణలో నిమగ్నమైన ధోనీ.. విక్టర్‌ ఫోర్స్‌లో విధులు

MS Dhoni Joins His Indian Army Battalion Victor Force In Kashmir
Lieutenant Colonel MS Dhoni joins his Indian Army Battalion Victor Force in Kashmir, performing duties

శ్రీనగర్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశ రక్షణలో నిమగ్నమయ్యాడు. వెస్టిండీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న ధోనీ బుధవారం నుంచి దక్షిణ కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. విక్టర్‌ ఫోర్స్‌లోని విధులలో భాగంగా తోటి జవాన్లతో కలిసి పెట్రోలింగ్, పోస్ట్‌ డ్యూటీ, గార్డ్ డ్యూటీలు చేస్తున్నాడు. పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ కల్నల్‌గా ఉన్న మహీ.. ఈ నెల 15 వరకు అక్కడే సేవలందించనున్నాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

బెంగళూరులో శిక్షణ:

బెంగళూరులో శిక్షణ:

ఆర్మీలో పనిచేయడానికి తనను అనుమతించాలని రాంచీకి చెందిన క్రికెటర్ ఎంఎస్ ధోనీ గత నెలలో ఆర్మీ చీఫ్‌ను కోరారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం నుండి అతనికి అనుమతి లభించింది. దీంతో విండీస్ పర్యటనకు అందుబాటులో ఉండడనని మహీ.. బీసీసీఐకి తెలిపాడు. ఇక విధులలో చేరేముందు శిక్షణ కోసం బెంగళూరు వెళ్ళాడు.

వీఐపీ మర్యాదలు ఉండవు:

వీఐపీ మర్యాదలు ఉండవు:

శిక్షణ అనంతరం ధోనీ బుధవారం శ్రీనగర్ చేరుకుని నేరుగా దక్షిణ కాశ్మీర్‌లోని విక్టర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాడు. అనంతరం విక్టర్ ఫోర్స్‌తో తన విధులను నిర్వర్తిస్తున్నాడు. అయితే ధోనీ ఎటువంటి ఆపరేషన్లో భాగం కాదు. ప్రధాన కార్యాలయానికి వచ్చిన తరువాత ధోనీ సహచరులకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ధోనీకి అక్కడ ఎలాంటి వీఐపీ మర్యాదలు ఉండవట. 'ధోనీ ఏడు రోజుల పాటు ఈ యూనిట్తో ఉంటాడు, ఈ సమయంలో అతను తనకు కేటాయించిన విధులను నిర్వర్తిస్తాడు. విధుల సమయంలో ఇతర అధికారిలాగే ఉంటాడు. అతని వద్ద వ్యక్తిగత గన్ ఉంటుంది' అని ఓ అధికారి తెలిపాడు.

యువతకు ఆదర్శం:

యువతకు ఆదర్శం:

దేశ వ్యాప్తంగా పలు బ్రాండ్ల ద్వారా వందల కోట్టు అర్జించే ధోనీ.. సాధారణ సైనికుడిలా దేశం కోసం సేవ చేయడం యువతకు మార్గదర్శకంగా ఉంటుందని భారత ఆర్మీ పేర్కొంది. ధోనీని అభిమానించే యువత ఆర్మీలో చేరే అవకాశం ఉందని ఆర్మీ భావిస్తోంది. విండీస్ పర్యటన నుండి ధోనీ స్వయంగా తప్పుకోవడంతో.. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు.

Story first published: Thursday, August 1, 2019, 16:20 [IST]
Other articles published on Aug 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X