న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హామిల్టన్ ఐదు అత్యుత్తమం: కెరీర్‌లో 50వ విజయం

By Nageshwara Rao

హైదరాబాద్: మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ (బ్రిటన్) యూఎస్‌ గ్రాండ్‌ ప్రిలో ఛాంపియన్‌గా నిలిచాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో హామిల్టన్ సత్తా చాటాడు. గత ఆరు రేసుల్లో హామిల్టన్‌కి ఇదే తొలి టైటిల్.

యూఎస్ గ్రాండ్ ప్రిలో పోల్‌ పొజిషన్‌ నుంచి రేస్‌ను ప్రారంభించిన హామిల్టన్‌ 56 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 38 నిమిషాల 12.618 సెకన్లలో ముగించి ప్రథమ స్థానంలో నిలిచాడు. తన ప్రత్యర్ధుల కన్నా ఐదు సెకన్ల ముందే లక్ష్యాన్ని చేరాడు. కాగా హామిల్టన్‌కు గట్టిపోటీ ఇస్తున్న అతని సహచరుడు నికో రోస్‌బర్గ్‌ నాలుగు సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలిచాడు.

రెడ్‌బుల్‌ డ్రైవర్‌ రికియార్డో మూడో స్థానాన్ని పొందాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఏడో విజయం కాగా కెరీర్‌లో 50వ విజయం. ఈ గెలుపుతో ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన డ్రైవర్స్ జాబితాలో హామిల్టన్ మూడో స్థానంలో నిలిచాడు. షుమాకర్ (91), ప్రాస్ట్ (51) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

తాజా విజయంతో హామిల్టన్‌ 25 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 305 పాయింట్లతో డ్రైవర్‌ చాంపియన్‌ షిప్‌లో రోస్‌బర్గ్‌ (331)కు పోటీ ఇస్తున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కు మరో మూడు రేసులు మిగిలి ఉన్నాయి. ఫోర్స్‌ ఇండియా డ్రైవర్‌ పెరెజ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

హామిల్టన్ తన తదుపరి రేసు మెక్సికో గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది. ఇదిలా ఉంటే భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, హుల్కెన్‌బర్గ్‌లకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను రాబట్టారు. పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలిచి నాలుగు పాయింట్లు పొందగా, హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే తప్పుకున్నాడు.

Lewis Hamilton: Mercedes driver brings up his half-century of wins

హామిల్టన్ ఐదు అత్యుత్తమ విజయాలు

* 2007 జపాన్ గ్రాండ్ ఫిక్స్
* 2008 మొనాకో గ్రాండ్ ఫిక్స్
* 2008 బ్రిటిష్ గ్రాండ్ ఫిక్స్
* 2011 చైనీస్ గ్రాండ్ ఫిక్స్
* 2012 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ఫిక్స్
* 2014 బహ్రెయిన్ గ్రాండ్ ఫిక్స్

వివిధ దేశాల్లో హామిల్టన్ సాధించిన విజయాలు:
Canada 5
Hungary 5
Britain 4
China 4
USA 5
Japan 3
Italy 3
Germany 3
Singapore 2
Abu Dhabi 2
Australia 2
Bahrain 2
Belgium 2
Monaco 2
Russia 2
Austria 1
Malaysia 1
Spain 1
Turkey 1

సంవత్సరాల వారీగా హామిల్టన్ సాధించిన విజయాలు
2007: 4
2008: 5
2009: 2
2010: 3
2011: 3
2012: 4
2013: 1
2014: 11
2015: 10
2016: 7 (to date)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X