న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒంటరిగా వదిలేయండి: ధోని అంతటి కీర్తిని మరెవరైనా సంపాదించారా?

‘Leave MS Dhoni alone, he’s a role model and should remain in team,’ says World Cup winning wicketkeeper


హైదరాబాద్:
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఒంటరిగా వదిలేయాలని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి అన్నారు. భారత జట్టులోని యువ క్రికెటర్లకు ఇప్పటికీ ధోనినే రోల్ మోడల్ అని ఆయన తెలిపారు. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వరల్డ్‌కప్‌లో ధోని ఆశించిన స్థాయిలో రాణించలేదు.

దీంతో వరల్డ్‌కప్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు. అయితే, అందుకు భిన్నంగా ధోని రెండు నెలలు పాటు క్రికెట్ దూరమై.. భారత ఆర్మీలో సేవలందించాడు. తాజాగా బెంగళూరులో హర్టింగ్ సొల్యూషన్స్‌కు సంబంధించిన ఔట్ లెట్స్‌ను సయ్యద్ కిర్మాణ్ ప్రారంభించిన నేపథ్యంలో ధోని ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది.

కిర్మాణి మాట్లాడుతూ

కిర్మాణి మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో కిర్మాణి మాట్లాడుతూ "అతడిని ఓంటరిగా వదిలేయండి. సమయం వచ్చినప్పుడు అతడే రిటైర్ అవుతాడు. ఇప్పుడే అతడి రిటైర్మెంట్ గురించి మాట్లాడుకోవడం నిలిపివేయాలి. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విధానం అతడిని అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిపింది" అని ప్రశంసల వర్షం కురిపించాడు.

టీమిండియాను తదుపరి లెవెల్‌కు

టీమిండియాను తదుపరి లెవెల్‌కు

"టెస్టు క్రికెట్, వన్డేలు, టీ20ల్లో అతడు టీమిండియాను తదుపరి లెవెల్‌కు తీసుకెళ్లాడు. భారత జట్టులోని యువ క్రికెటర్లకు ధోని రోల్ మోడల్. అతడు జట్టులోనే కొనసాగాలి. టెస్టు క్రికెట్ నుంచి ఇప్పటికే తప్పుకున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకోవాలనేది అతడి నిర్ణయానికే వదిలేయండి. మీరు మధ్యలో కలగజేసుకోవద్దు. ధోని అంతటి కీర్తిని మరెవరైనా సంపాదించారా?" అని అన్నాడు.

ఫరూక్ ఇంజనీర్ కెరీర్ ముగింపు దశలో

ఫరూక్ ఇంజనీర్ కెరీర్ ముగింపు దశలో

ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి తన అరంగేట్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. "వికెట్ కీపర్‌గా ఫరూక్ ఇంజనీర్ కెరీర్ ముగింపు దశలో ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరూ తర్వాత ఎవరు? అని ప్రశ్నించారు. అప్పుడు కిర్మాణి వచ్చాడు. ఆ తర్వాత కిరణ్ మోరీ, మహేంద్ర సింగ్ ధోని వచ్చారు" అని కిర్మాణి తెలిపాడు.

ఎవరో ఒకరు ధోని స్థానాన్ని ఆక్రమిస్తారు

ఎవరో ఒకరు ధోని స్థానాన్ని ఆక్రమిస్తారు

"ఎవరో ఒకరు ధోని స్థానాన్ని తప్పకుండా ఆక్రమిస్తారు. ప్రస్తుతం భారత జట్టులో ముగ్గురు లేదా నలుగురు టాలెంట్ ఉన్న వికెట్ కీపర్లు ఉన్నారు. క్రికెట్‌లో వికెట్ కీపింగ్ అనుకున్నంత ఈజీ కాదు. మైదానంలో అత్యంక క్లిష్టమైన పొజిషన్ అది. ఒక జత కీపింగ్‌ గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరు" అని కిర్మాణి అన్నాడు.

Story first published: Wednesday, August 28, 2019, 14:20 [IST]
Other articles published on Aug 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X