న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ సక్సెస్‌కు కారణం అతడే: డేవిడ్ బెకహామ్‌కు అరుదైన గౌరవం

LA Galaxy unveil statue of David Beckham at MLS opener

హైదరాబాద్: ఇంగ్లాండ్ దిగ్గజ పుట్‌బాలర్ డేవిడ్‌ బెక్‌హామ్‌కు అరుదైన గౌరవం లభించింది. మేజర్ లీగ్ 24వ సీజన్ సందర్భంగా డేవిడ్‌ బెక్‌హామ్‌‌ను లాస్‌ ఏంజిల్స్‌ క్లబ్‌ అరుదైన గౌరవంతో సత్కరించింది. డిగ్నిటీ హెల్త్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ బయట బెక్‌హామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించింది.

పన్ను మినహాయింపు లేకపోతే ఆ భారం బీసీసీఐ మోయాల్సిందేపన్ను మినహాయింపు లేకపోతే ఆ భారం బీసీసీఐ మోయాల్సిందే

ఈ సీజన్‌లో లాస్‌ఏంజిల్స్ క్లబ్ ఆడిన తన తొలి మ్యాచ్‌లో చికాగో ఫైర్‌పై 2-1తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అయిన బెక్‌హామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించింది. లాస్‌ఏంజిల్స్ గెలాక్సీ తరఫున ఆరు సీజన్లకు గాను డేవిడ్ బెకహామ్ 122 మ్యాచ్‌లు ఆడాడు.

అంతేకాదు రెండుసార్లు మేజర్‌ లీగ్‌ సాకర్‌ కప్‌ ట్రోఫీని కూడా అందించాడు. గెలాక్సీ జట్టుతో డేవిడ్‌ బెకహామ్ జత కట్టడంతో ఈ లీగ్‌ పాపులారిటీ అమాంతం పెరిగింది. అంతేకాదు డేవిడ్ బెకహామ్ ఆడుతున్నాడని తెలిసి మరికొందరు అంతర్జాతీయ పుట్ బాలర్లు ఈ లీగ్‌పై ఆసక్తిని కనబర్చారు.

మేజరీ లీగ్ కమిషనర్ డాన్ గార్బెర్ మాట్లాడుతూ "డేవిడ్ బెకహామ్ తీసుకున్న నిర్ణయంతోనే ఈరోజు ఈ లీగ్ ఇంతటి సక్సెస్‌ను సాధించింది" అని అన్నారు. ఇంగ్లాండ్ అత్యుత్తమ పుట్ బాల్ ఆటగాళ్లలో డేవిడ్ బెక్‌హామ్ ఒకడు. ఫిఫా వరల్డ్ కప్‌లో బెక్‌హామ్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు 2006లో జరిగిన వరల్డ్ కప్‌లో ఫైనల్స్‌ వరకు వెళ్లింది.

యూరోపియన్ లీగ్‌ల్లో బెక్‌హామ్ మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇంగ్లాండ్ జట్టు తరుపున మూడు సార్లు వరల్డ్ కప్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Monday, March 4, 2019, 13:55 [IST]
Other articles published on Mar 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X