న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉతికి ఆరేసిన మాక్స్‌వెల్: పూణే‌పై పంజాబ్ విజయం

ఐపీఎల్ 10లో భాగంగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు ఓపెనర్లు మైదానంలోకి అడుగుపెట్టారు.

ఇండోర్: తమ ముందు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఉంచిన 163 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఒక ఓవరు మిగిలి ఉండగానే ఛేదించి విజయాన్ని అందుకుంది. మాక్స్‌వెల్ పూణే బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో విజయం వరించింది. అతను 20 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్ల సహాయంతో 44 పరుగులు చేశాడు.

డేవిడ్ మిల్లర్ 27 బంతుల్లో 30 పరుగులు చేసి అతనికి తోడ్పాటు అందించాడు. దీంతో పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి గెలుపు సాధించింది. ఆమ్లా 28 పరుగులు చేయగా, సాహా 14 పరుగులు చేశాడు.

పూణే బౌలర్లలో తాహిర్‌‌కు రెండు వికెట్లు లభించగా, దిండా, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పూణే కేవలం 163 పరుగులు మాత్రమే చేసింది.

ఐపీఎల్ 10లో భాగంగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ నిర్ణీత 20ఓవర్లలో 163 పరుగులు చేసింది. ఆరంభం నుంచి తడబాటుకు గురైన పుణె బ్యాట్స్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.

పుణె బ్యాట్స్‌మెన్లలో రహానే 19, అగర్వాల్ 0, స్మిత్ 26, స్టోక్స్ 50, ధోనీ 5, క్రిస్టియన్ 17, పరుగులు చేసి ఔటయ్యారు. తివారి 40, భాటియా 0 పరుగులతో అజేయంగా నిలిచాడు.

వెంట వెంటనే

36 పరుగుల వద్ద నటరాజన్ బౌలింగ్‌లో రహానే ఔటయ్యాడు. 15బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 19 పరుగులు చేశాడు రహానే. ఆ తర్వాత స్టోయిన్స్ బౌలింగ్‌లో 49 పరుగుల వద్ద స్మిత్ 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే ఎంఎస్ ధోనీ కూడా కేవలం 5 పరుగులు చేసి స్వప్నిల్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం స్టోక్స్ 22, తివారీ 8 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.

KXIP vs RPS: Punjab win toss, elect to field against Pune at Indore

తొలి ఓవర్లోనే వికెట్

అంతకుముందు సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్లోనే పుణె ఓపనర్ అగర్వాల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరుకున్నారు. ఆ తర్వాత స్మిత్ మైదానంలో అడుగుపెట్టాడు. రహానే 18, స్మిత్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X